పువ్వులతోనే వేడినీళ్లు

3 Oct, 2021 18:59 IST|Sakshi

మనం వేడి నీళ్లు కావాలంటే హీటర్‌ పెట్టుకోవడం లేదా గేజర్‌ ఆన్‌ చేసుకుంటాం కదా. కానీ ఇక నుంచి ఆ అవసరం లేదు దాని స్థానంలో మనం పువ్వులతో నీళ్లని వేడి చేసుకోవచ్చు ఎలా అని ఆశ్చర్యంగా ఉంది కదూ!. ఏం లేదండి సోలార్‌ ప్యానెల్‌తో తయారు చేసిన పూలు మరి. ఇవి నీటిలో వేసినప్పుడు అవి సూర్యకాంతిని గ్రహించి చాలా తక్కువ సమయంలోనే నీళ్లను వేడిగా మార్చేస్తాయట. అందుకే చాలా మంది వీటిని కోనేసుకుని వాళ్ల స్విమ్మింగ్‌ పూల్‌లో వేసేసుకుంటున్నారట.

(చదవండి: ఓల్డ్‌ కార్‌ సీట్‌ బెల్ట్‌తో బ్యాగ్‌లు)

మరికొంత మంది అయితే బకెట్లలో ఆ పువ్వులు వేసుకుని బాల్కనీలో ఆరుబయట సూర్యునికి ఎదురుగా కాసేపు పెట్టి ఆ తరువాత వాడేసుకుంటున్నరట. ఈ పూలు చూడటానికి అందంగా ఆకర్షణియంగా ఉండటంతో పాటు పూల్‌ నీటి కొలనులో ఉండే తామర పూలు మాదిరి అందంగా  ఉంటుంది. అంతేకాదండోయ్‌ ఇవి ప్యాక్‌కి 12 ఉంటాయట. ఇవి ఎక్కువగా నీలం,నలుపు, రెయిన్‌బో హ్యూడ్‌ రంగులలో లభిస్తాయట. ఇక మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి

(చదవండి: స్వచ్ఛ కార్యక్రమాలతో అలరించిన నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్)

మరిన్ని వార్తలు