కో-విన్‌ నకిలీ యాప్‌ల హల్‌చల్‌, కేంద్రం హెచ్చరిక

6 Jan, 2021 18:15 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ మహమ్మారికి అంతానికి గాను అతి త్వరలోనే వ్యాక్సినేషన్‌ ప్రక్రియ అందుబాటులోకి రానున్న సమయంలో కేంద్ర ఆరోగ్య శాఖ కీలక ప్రకటన చేసింది. ‘కో-విన్‌’ పేరుతో నకిలీ, అక్రమ యాప్‌లు యాప్‌లో స్టోర్‌లో ఉన్నాయని అప్రమత్తంగా ఉండాలని బుధవారం సూచించింది. సదరు యాప్‌ల మాయలోపడి వ్యక్తిగత డేటాను, ఇతర సమాచారాన్ని పంచుకోవద్దని  తెలిపింది. అలాంటి యాప్‌లను డౌన్‌లోడ్ చేయవద్దని తీవ్రంగా హెచ్చరించింది. (వ్యాక్సిన్‌ వచ్చేసింది : రిజిస్ట్రేషన్‌ ఎలా?)

వ్యాక్సిన్‌ పొందేందుకు  కేంద్రం ప్రభుత్వం కోవిన్‌ పేరుతో సరికొత్త యాప్‌ను తీసుకురానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వ అధికారిక ప్లాట్‌ఫారమ్‌కు  సరిపోలిన నకిలీ యాప్‌లతో అక్రమార్కులు అప్పుడే తమ పని మొదలు పెట్టేశారన్న మాట. కోవిన్ పేరుతో ప్లే స్టోర్‌లో ఇప్పటికే 3 యాప్స్ ఉన్నాయి. వీటిని ఇప్పటికే 10వేల మందికి పైగా డౌన్‌లోడ్ చేసుకున్నారు. దీంతో అప్రమత్తమైన ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా హెచ్చరికలు జారీ చేసింది. ప్రభుత్వ కో-విన్‌ యాప్‌ ను అధికారికంగా ఆవిష్కరించినపుడు,  విస‍్తృత సమాచారాన్ని అందిస్తామని స్పష్టం చేసింది.

కాగా సీరం రూపొందిస్తున్న కోవీషీల్డ్‌, భారత్‌బయోటెక్‌ ఉత్పత్తి చేస్తున​ కోవాగ్జిన్‌  వ్యాక్సీన్ల దేశంలో అత్యవసర వినియోగానికి గాను ప్రభుత్వం ఆదివారం ఆమోదం తెలిపింది. అయితే తొలి దశలో ఫ్రంట్‌లైన్ కార్మికులకు వ్యాక్సిన్ ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కోసం డిజిటల్ ప్లాట్‌ఫామ్ కోవిన్‌ను ప్రవేశపెట్టింది. అలాగే  ఈ టీకా ప్రక్రియ కోసం ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.  అయితే సామాన్య ప్రజానీకానికి ఈ యాప్‌ ఇంకా అందుబాటులోకి రాలేదు. 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు