తల్లికి తగ్గ తనయుడు.. 27 ఏళ్ల తర్వాత ఆర్మీ ఆఫీసర్‌గా.. !

1 Aug, 2022 17:36 IST|Sakshi

చెన్నై: తన తల్లి అడుగుజాడల్లో నడిచి తాను అనుకున్నది సాధించాడు ఓ యువకుడు. తల్లికి తగ్గ తనయుడు అని నిరూపించుకున్నాడు. తల్లి ఎక్కడైతే శిక్షణ తీసుకుని ఆర్మీ ఆఫీసర్‌గా బాధ్యతలు నిర్వర్చించారో అదే అకాడమీ నుంచి 27 ఏళ్ల తర్వాత ఆర్మీ ఆఫీసర్‌గా ఎదిగాడు రిటైర్డ్‌ మేజర్‌ స్మితా చతుర్వేది కుమారుడు. తల్లీకుమారుల ఫోటోను ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసింది భారత రక్షణ శాఖ. ప్రస్తుతం ఆ ఫోటోలు వైరల్‌గా మారాయి. 

చెన్నైలోని ఆఫీసర్స్‌ ట్రైనింగ్‌ అకాడమీలో ఇటీవలే వేడుకలు నిర్వహించారు. మాల్దీవులకు చెందిన సైన్యాధినేత మేజర్‌ జెనరల్‌ అబ్దుల్లా శామాల్‌ హాజరయ్యారు. ఆ ప్రత్యేక రోజున రిటైర్డ్‌ మేజర్‌ స్మితా, ఆమె కుమారుడు ఉన్న ఫోటోను రక్షణ శాఖ చెన్నై అకాడమీ ప్రతినిధి ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ‘27 ఏళ్ల క్రితం 1995లో రిటైర్డ్‌ మేజర్‌ స్మితా చతుర్వేది చెన్నైలోని ట్రైనింగ్‌ అకాడమీ నుంచే సైన్యంలో చేరారు. అదే అకాడమీ నుంచి అదే రీతిలో ఆమె కుమారుడు సైతం సైన్యంలోకి వచ్చారు.’ అని రాసుకొచ్చారు.

ఇదీ చదవండి: రాకెట్‌ లాంచ్‌ని ప్రత్యక్షంగా చూడాలనుకునే వారికి ‘ఇస్రో’ బంపర్‌ ఆఫర్‌

మరిన్ని వార్తలు