కి‘లేడీ’లు.. క్లోజ్‌గా మాట్లాడి హానీట్రాప్‌ చేసి ఆ తర్వాత..

25 Aug, 2022 07:22 IST|Sakshi

కృష్ణరాజపురం:  ప్రభుత్వ టెండర్‌ పేరిట మహిళా గ్యాంగ్‌ ఒకటి నగరంలోని పారిశ్రామికవేత్త కుమారుడిని కిడ్నాప్‌ చేసి డబ్బులను దోచుకుంది. బాధితుల ఫిర్యాదు మేరకు వివరాలు.. కర్నాటకకు చెందిన రవి అనే పారిశ్రామికవేత్త కుమారుడు సూరజ్‌. వీరు బ్యాటరాయనపుర ప్రాంతంలో రవి ఇండ్రస్టియల్‌ సప్లయ్‌ కంపెనీ నిర్వహిస్తున్నారు.  

టెండర్‌ ఇప్పిస్తానని..  
సూరజ్‌కు ప్రభుత్వ పనుల టెండర్‌ ఇప్పిస్తానని పుష్పలత అనే మహిళ నాలుగు సార్లు కలిసింది. శ్రీ అబ్దుల్‌ కలాం చారిటబుల్‌ ట్రస్టు అధ్యక్షురాలిగా పరిచయం చేసుకున్న పుష్పలత పలుమార్లు సూరజ్‌ను  హనీట్రాప్‌ చేయాలని చూసింది. సంతోష్‌ అనే వ్యక్తిని సూరజ్‌కు పరిచయం చేసి ఇతడు ఐఏఎస్‌ అధికారి పీఏ అని, టెండర్‌ ఇప్పిస్తాడని నమ్మబలికింది. ఆ తర్వాత మరో ఇద్దరిని పరిచయం చేసింది.  

అపహరించి రూ.4 కోట్లు డిమాండ్‌ 
సూరజ్‌ నుంచి ఎలాగైనా డబ్బు వసూలు చేయాలని మూడురోజుల క్రితం అతడిని కిడ్నాప్‌ చేశారు. రూ. 4 కోట్లు ఇవ్వాలని లేదంటే నీపై అత్యాచారం కేసు పెడతామని పుష్ప, సంతోష్‌, అయ్యప్ప అలియాస్‌ అర్జున్, రాకేశ్‌లు పిస్టల్‌ చూపి బ్లాక్‌మెయిల్‌ చేశారు. అంత డబ్బులు లేవని, తనను వదిలిపెట్టాలని సూరజ్‌ బతిమాలుకున్నాడు. అయినా నిందితులు వినకపోవడంతో ఆ తర్వాత తన స్నేహితుడు గురుమూర్తికి కాల్‌ చేసి రూ.25 లక్షల నగదును అందజేయగా పుష్పలత వదిలిపెట్టింది. సూరజ్‌ బ్యాటరాయనపుర పోలీసులకు ఫిర్యాదు చేయగా బుధవారం నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. 

ఇది కూడా చదవండి: మేఘనా సర్జా రెండో పెళ్లి? ఆమె ఏమందంటే?

మరిన్ని వార్తలు