సైనికుల కోసం సోలార్ టెంట్లు

22 Feb, 2021 15:15 IST|Sakshi

దేశ రక్షణ కోసం సైనికులు ఎండకు, వానకు, చలికి తట్టుకొని అత్యంత కఠిన పరిస్థితుల్లో విధులు నిర్వహిస్తారు. జమ్ము కాశ్మీర్, శ్రీనగర్, లడక్ వంటి ప్రాంతాల్లో శీతాకాలంలో గడ్డ కట్టే చలిలో విధులు నిర్వహించాలంటే కత్తి మీద సాములాగా ఉంటుంది. ఏ కొంచెం అజాగ్రత్తగా ఉన్న ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుంది. ఒకొక్కసారి ఇక్కడ చలికి సైనికులు ప్రాణాలను సైతం కోల్పోతున్నారు. అయితే ఇప్పటి వరకూ సైనికుల క్యాంపుల్లో వాడే టెంట్లు విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. 

బాలీవుడ్ బ్లాక్ బస్టర్ '3 ఇడియట్స్'సినిమాలోని 'ఫన్సుఖ్ వాంగ్డు' పాత్ర వెనుక ఉన్న వ్యక్తి సోనమ్ వాంగ్చుక్. ఈ సోనమ్ వాంగ్చుక్ లడఖ్ లాంటి ప్రాంతంలో ఉన్న ఆర్మీ జవాన్లకు వెచ్చదనం కోసం ఒక పరిష్కారం కనుగొన్నారు. అతను ఒకేసారి 10 మంది జవాన్లకు వసతి కల్పించే సౌరశక్తితో నడిచే పోర్టబుల్ సైనిక గుడారాన్ని నిర్మించాడు. గాల్వన్ వ్యాలీ వంటి ప్రాంతాలలో రాత్రి 10 గంటలకు గుడారం బయట మైనస్ 14 డిగ్రీలు ఉన్నప్పటికీ గుడారం లోపల సుమారు 15 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుందని తెలిపారు. 10మంది జవాన్లకు వసతి కల్పించే విధంగా ఈ టెంట్ ను తయారు చేశారు. దీని బరువు 30 కిలోల కన్నా తక్కువ ఉంటుంది. ఈ సోలార్ టెంట్ పూర్తిగా పోర్టబుల్. కనుక సైనికులకు ఈ టెంట్ అత్యంత శీతల ప్రాంతాల్లో కూడా ఉపయోగపడుతుందని వారు సురక్షితంగా సోనమ్ ఉంటారని చెప్పారు.

చదవండి:

వాహనదారులకు కేంద్రం తీపికబురు

'5జీ'తో ఐటీ దిగ్గజాలకు కాసుల పంట

మరిన్ని వార్తలు