National Herald case: మూడో రోజు ఈడీ ముందుకు సోనియా.. కాంగ్రెస్‌ ఆందోళనలు

27 Jul, 2022 11:18 IST|Sakshi

న్యూఢిల్లీ: నేషనల్‌ హెరాల్డ్‌- ఏజేఎల్‌ ఆస్తులకు సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో విచారణ ఎదుర్కొంటున్నారు కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ. ఈ క్రమంలోనే మూడో రోజు విచారణకు హజరయ్యారు. తన కుమార్తె  ప్రియాంక గాంధీలతో కలిసి ఈడీ కార్యాలయానికి వచ్చారు.  ఈ క్రమంలో కాంగ్రెస్ కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు అధికారులు. ఈడీ పరిసరలా

మంగళవారం సుమారు ఆరు గంటల పాటు విచారించింది ఈడీ. ఈ సమయంలో ఢిల్లీతో పాటు దేశవ్యాప్తంగా ఆందోళనలకు దిగింది కాంగ్రెస్. దీంతో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీతో పాటు కీలక నేతలు, వందల మంది కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విడిచిపెట్టారు. మూడో రోజు విచారణ సందర్భంగా ఆందోళనలు చేపట్టే అవకాశం ఉన్నందున కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. 

మరిన్ని వార్తలు