బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌కు సోనియా అభినందనలు

26 Oct, 2022 20:36 IST|Sakshi

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ నాయకురాలు సోనియా గాంధీ బ్రిటన్‌ కొత్త ప్రధానిగా ఏకగ్రీవంగా ఎన్నికైన రిషి సునాక్‌కు అభినందనలు తెలిపారు. అలాగే సునాక్‌ పదవీ కాలంలో భారత్‌తో బ్రిటన్‌ సంబంధాలు మరింత బలపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ మేరకు సోనియాగాంధీ ప్రధాని రిషి సునాక్‌ని అభినందిస్తూ ఒక లేఖ కూడా రాశారు.

ఆ లేఖలో ...బ్రిటన్‌ ప్రధానిగా బాధ్యతలు చేపట్టినందుకు సంతోషిస్తున్నాను. ఇది భారత్‌కి ఎంతగానో గర్వకారణం. అలాగే భారత్‌ బ్రిటన్‌ సంబంధాలు ఎంత ప్రత్యేకమైనవి. అవి మీ హయాంలో మరింత పెరుగుతాయని విశ్వసిస్తున్నాను అని అన్నారు. ఏదిఏమైన బ్రిటన్‌ ప్రధానిగా రిషి సునాక్‌ ఎన్నికవ్వడం అనేది చారిత్రాత్మకమైన ఘట్టం.
(చదవండి: డర్టీ బాంబు అంటూ రష్యా గగ్గోలు...భారత రక్షణ మంత్రితో మొర)

మరిన్ని వార్తలు