అసమ్మతి నేతలతో సోనియా భేటీ

19 Dec, 2020 12:03 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీలో పలువురు సీనియర్‌ నాయకులు పార్టీలో ప్రక్షాళన జరగాలని అధిష్టానానికి వ్యతిరేకంగా ఇటీవల కీలక వ్యాఖ్యల చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సీనియర్‌ నేతల అసంతృప్తిని చల్చార్చే ప్రయత్నానికి కాగ్రెస్‌ పార్టీ శ్రీకారం చుట్టింది. అందులో భాగంగానే  కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ శనివారం సీనియర్‌ నాయకులతో భేటీ అయ్యారు. పార్టీలో ప్రక్షాళన జరగాలంటూ పలువురు కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు సోనియా గాంధీకి లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ లేఖ కాంగ్రెస్‌ పార్టీలో తీవ్ర సంచలనం రేపింది. చదవండి: కాంగ్రెస్‌ తీరు మారినట్టేనా?

కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్ష, సీడబ్ల్యూసీ సభ్యత్వ పదవులకు అంతర్గత ఎన్నికలు నిర్వహించాలని 23 మంది సీనియర్‌ నాయుకులు అసమ్మతి గళం వినిపించారు. ఎట్టకేలకు అసమ్మతి నేతలతో భేటీ అయిన సోనియా, సీనియర్‌ నేతల మధ్య కమల్‌నాథ్‌ సంధాన కర్తగా వ్యహరిస్తున్నారు. ఈ భేటీలో కాంగ్రెస్‌ నేతలు ఏకే ఆంటోనీ, అశోక్‌ గెహ్లోట్, అంబికా సోని, గులాం నబీ ఆజాద్, ఆనంద్ శర్మ, వివేక్ తంఖా, శశి థరూర్, మనీష్ తివారీ, భూపిందర్ సింగ్ హుడా, పీ. చిదంబరం పాల్గొన్నారు. అసమ్మతి నేతలతో జరుగుతున్న ఈ భేటీ పాధాన్యత సంతరించుకుంటోంది.

మరిన్ని వార్తలు