ఏంటి సార్ ! మా నాన్నకి అంత్య‌క్రియ‌లు చేయ‌డం కూడా త‌ప్పేనా

1 Jun, 2021 14:21 IST|Sakshi

తండ్రికి అంత్య‌క్రియ‌లు చేసిన కుమారులు 

కుమారుల‌పై చ‌ర్య‌ల‌కు సిద్ధ‌మైన పోలీస్ అధికారులు  

ల‌క్నో: కరోనా దెబ్బ‌కు అయిన వారు, ఆప్తులు దూరం అవుతున్నారు. చిన్న‌బోయిన అనురాగాలు నిస్స‌హాయ‌తను వ్య‌క్తం చేస్తుంటే..మానవత్వం తల ఎత్తుకోలేక…ఊరు విడిచి వెళ్లిపోతోంది. వీటన్నిటినీ దూరం చేసిన కరోనా మహమ్మారి చితి మంటల వికటాట్ట హాసం చేస్తోంది. ఉత్త‌ర్ ప్ర‌దేశ్ లోని సంత్ క‌బీర్ న‌గ‌ర్ జిల్లాకు చెందిన రామ్ లలిత్ (62) అనారోగ్యానికి గుర‌య్యాడు. దీంతో అత‌ని కుమారులు అత్య‌వ‌స‌ర చికిత్స కోసం గోరఖ్‌పూర్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి త‌ర‌లించారు. వైద్య ప‌రీక్ష‌లు చేసిన డాక్ట‌ర్లు బాధితుడికి క‌రోనా సోకిన‌ట్లు తేలింది. అయినప్పటికీ తండ్రిని ఆస్ప‌త్రి నుంచి  ఇంటికి తీసుకెళ్లారు కుమారులు. అలా ఇంటికి తీసుకెళ్లిన కొద్దిసేప‌టికే రామ్ ల‌లిత్ మ‌ర‌ణించాడు.  

మ‌ర‌ణించిన తండ్రిని, తండ్రి ప‌డుకున్న మంచాన్ని జేసీబీ సాయంతో స్థానికంగా ఉన్న పొలాల్లోకి త‌ర‌లించారు. అక్క‌డే ఖ‌ననం చేశారు. ఆ వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవ్వ‌డంతో సంత్ క‌బీర్ న‌గ‌ర్ ఎస్పీ కౌస్తుబ్ విచార‌ణ‌కు ఆదేశించారు. వైర‌ల్ అవుత‌న్న వీడియోలో బాధితుడి డెడ్ బాడీని ఖ‌న‌నం చేసేందుకు అత‌ని కుమారులు జేసీబీతో పూడిక తీయిస్తున్నారు. ఇది చ‌ట్ట‌రిత్యా నేరం. క‌రోనాతో మ‌ర‌ణించిన వారి అంత్య‌క్రియ‌ల విష‌యంలో ప్ర‌భుత్వ అనుమ‌తి తీసుకోవాల‌ని సూచించారు. అయితే పోలీసుల తీరుపై కుమారులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. అది అనాథశ‌వం కాద‌ని, త‌న తండ్రిదేన‌ని వాపోయారు. అంత్య‌క్రియ‌లు ఇలా చేస్తే త‌ప్పేంట‌ని ప్ర‌శ్నిస్తున్నారు. 

చ‌ద‌వండి : కొడుకు మందుల కోసం 300 కి.మీ.సైకిల్‌ తొక్కిన తండ్రి
 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు