Sonu Sood: ప్రాణం పోసిన సోనూసూద్‌ ట్రస్ట్‌

5 May, 2021 08:30 IST|Sakshi

పైవేటు ఆస్పత్రిలో ఆక్సిజన్‌ నిల్వలు ఖాళీ

 వెంటనే స్పందించి సిలిండర్లు పంపిన ట్రస్టు

 13 మంది కరోనా బాధితులకు తప్పిన ప్రాణాపాయం 

యలహంక: ఆక్సిజన్‌ నిల్వలు ఖాళీ కావడంతో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న కరోనా రోగులకు సోనూసూద్‌ చారిటబుల్‌ ట్రస్టు సకాలంలో ప్రాణవాయివు అందించి ప్రాణాలు నిలిపింది. బెంగళూరులోని యలహంక వద్ద ఆర్క ప్రైవేటు ఆస్పత్రిని కోవిడ్‌ ఆస్పత్రిగా మార్పు చేశారు. ఇక్కడ 15 మందికి పైగా కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత 1.30 గంటలకు ఆక్సిజన్‌ నిల్వలు నిండుకున్నాయి. ఓ మహిళా బాధితురాలి సోదరుడు అనిల్‌ గుర్తించి ఆస్పత్రి సిబ్బందిని అలర్ట్‌ చేశాడు. దీంతో యాజమాన్యం యలహంక న్యూటౌన్‌ పోలీసులకు సమాచారం ఇచ్చారు.

సీఐ సత్య నారాయణ అక్కడికి సమీపంలోని సోనూసూద్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌కు ఫోన్‌ చేసి పరిస్థితిని వివరించగా 11 ఆక్సిజన్‌ సిలిండర్లను బైక్‌లు, కార్లలో ఆస్పత్రికి పంపగా ఆక్సిజన్‌ వ్యవస్థను పునరుద్ధరించారు. అయితే, అప్పటికే ఇద్దరు మహిళలు మృతి చెందగా 13 మంది ప్రాణాపా యస్థితి నుంచి బయట పడ్డారు. సకాలంలో ఆక్సిజన్‌ అందించిన ట్రస్టు సభ్యులు అశ్మత్, రాధిక, రాఘవ్‌లకు ఆస్పత్రి యాజమాన్యం కృతజ్ఞతలు తెలియజేసింది.
 

మరిన్ని వార్తలు