టెన్షన్‌ పెడుతున్న కొత్త రకం బ్యాంకింగ్‌ వైరస్‌.. స్మార్ట్‌ఫోన్‌ వినియోగదారులూ జాగ్రత్త!

19 Sep, 2022 07:52 IST|Sakshi

బనశంకరి: నేరాలు దాని స్వరూపాన్ని మార్చుకుంటోంది. క్రెడిట్‌ కార్డులు బకాయిలు చెల్లించలేదని, ఏటీఎం కార్డు గడువు ముగిసిందని ఫోన్‌ చేసి ఓటీపీలు అడిగి డబ్బులు కాజేసేవారు. ఇప్పుడు కస్టమర్ల బ్యాంకు అకౌంట్లకు కన్నం వేసేందుకు సోవా అనే మొబైల్‌ బ్యాంకింగ్‌ ట్రోజన్‌ వైరస్‌ అడుగు పెట్టింది. దీనిపట్ల అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వ సైబర్‌ సెక్యూరిటీ ఏజెన్సీ హెచ్చరించింది. ఆండ్రాయిడ్, స్మార్ట్‌ఫోన్లలో మొబైల్‌ బ్యాంకింగ్‌ అప్లికేషన్లను టార్గెట్‌గా చేసుకుని ఈ వైరస్‌ దాడి చేస్తుంది. అమెరికా, రష్యా, స్పెయిన్‌ అనంతరం భారత్‌ బ్యాంకింగ్‌ వినియోగదారులను టార్గెట్‌గా చేసుకుంది. జూలైలో ఈ వైరస్‌ భారత్‌లో కనబడగా ప్రస్తుతం మరింత అప్‌డేట్‌ కాబడి తన హవా కొనసాగిస్తోంది. మొబైల్‌ బ్యాంకింగ్‌ అప్లికేషన్‌ వినియోగదారులను టార్గెట్‌గా చేసుకుని దాడి చేస్తుంది. మొబైల్‌లో ప్రవేశించే ఈ వైరస్‌ను తొలగించడం (అన్‌ ఇన్‌స్టాల్‌) చాలాకష్టం. ఎందుకంటే ఇది ఆండ్రాయిడ్‌ యాప్‌ల్లో దాగి ఉంటుంది. 

వివిధ రూపాల్లో..
పేమెంట్‌ యాప్‌ రూపంలో సోవా మీ మొబైల్‌లో చేరవచ్చు. బ్యాంకింగ్‌ ఇ–కామర్స్‌ యాప్‌లు రూపంలో కనబడవచ్చు. వాటిని వినియోగించినప్పుడు కస్టమర్లు వ్యక్తిగత వివరాలు బ్యాంకింగ్, ఆర్థిక వ్యవహారాల సమాచారం చోరీకి గురి అవుతుందని జాతీయ కంప్యూటర్‌ భద్రతా అత్యవసర బృందం (సర్ట్స్‌ ఇన్‌) హెచ్చరించింది. గూగుల్‌క్రోమ్, అమెజాన్, ఎఫ్‌ఎఫ్‌టీ రూపంలో స్మార్ట్స్‌ ఫోన్‌లోనికి దొంగలా వచ్చి ఇన్‌స్టాల్‌ అవుతుంది. అనంతరం వినియోగదారులకు తెలియకుండా పాస్‌వర్డ్‌ లాగిన్‌ వివరాలు చోరీ చేస్తుంది.

ఇది ప్రమాదకరం సోవా–0.5
సోవా కానీ లేదా మరో వైరస్‌ కానీ సైబర్‌స్పేస్‌లో కస్టమర్లు నిత్యం అప్రమత్తంగా ఉండాలి సోవా అనేది కొత్తది కాదు. విదేశాల్లో ఇది చాలా వరకు దెబ్బతీసింది. ప్రస్తుతం భారత్‌లో ప్రవేశించిన సోవా 5.0 మరింత ప్రమాదకారి అని సైబర్‌ నిపుణుడు జీ.అనంతప్రభు తెలిపారు. మొబైల్‌ లేదా కంప్యూటర్‌లో రారయండ్‌ సమ్‌వేర్‌లో చేరుకుని మీ అకౌంట్‌ను లాక్‌ చేస్తుంది. అన్‌లాక్‌ చేయడానికి సైబర్‌ వంచకులు డబ్బు అడుగుతారు. ఈ ఫ్యూచర్‌ సైతం సోవాకు చేరుతుంది. కస్టమర్లు జాగ్రత్త వహించాలి. గూగుల్, ఫేస్‌బుక్, జీ మెయిల్‌ వినియోగదారులను టార్గెట్‌గా చేసుకుని దాడి చేస్తుంది. బ్యాకింగ్‌ వ్యవహారాలకు కన్నం వేస్తుంది.

200కు పైగా యాప్‌లు
బ్యాంకింగ్‌ అప్లికేషన్లు, క్రిప్టో ఎక్సేంజీలు, వ్యాలెట్లతో పాటు 200కు పైగా మొబైల్‌ అప్లికేషన్లను కొత్త వైరస్‌ టార్గెట్‌ చేసుకుంటుందని భద్రతా సంస్థ తెలిపింది. వినియోగదారులు తమ నెట్‌బ్యాకింగ్‌ అప్లికేషన్‌లకు లాక్‌ ఇన్‌ చేయగా, బ్యాంక్‌ అకౌంట్లలో ప్రవేశించినప్పుడు ఈ సోవా మాల్‌వేర్‌ డేటాను కాజేస్తుంది. సైబర్‌ సాక్షరత సమస్యకు పరిహారమని ఐటీ నిపుణుడు వినాయక్‌ పీఎస్, తెలిపారు.

ఇలా జాగ్రత పడాలి :
- మొబైల్‌ బ్యాంకింగ్‌ వ్యవహారాలు చేసేవారు తమ అకౌంట్‌ను రెండు దశల్లో ధ్రువీకరణ (ఐడెంటీఫికేషన్‌) వ్యవస్థ వినియోగించాలి.
- బ్యాంకింగ్‌ యాప్‌లను నిత్యం అప్‌డేట్‌ చేయాలి
- కచ్చితంగా ఉత్తమమైన యాంటీ వైరస్‌ మొబైల్‌ వినియోగించాలి
- మొబైల్స్‌కు వచ్చే ఎలాంటి లింక్‌లను క్లిక్‌ చేయరాదు
- యాప్‌లు, ఓపెన్, బ్రౌజర్లు నిత్యం అప్‌డేట్‌ చేసి అధికారిక యాప్‌ స్టోర్‌ నుచి డౌన్‌లోడ్‌ చేసుకుని అప్లికేషన్లును మాత్రమే వినియోగించాలి.
- పబ్లిక్‌ వైఫైను వినియోగించడం సాధ్యమైనంత వరకు తగ్గించాలి.

మరిన్ని వార్తలు