-

తాలిబన్లది స్వాతంత్య్ర పోరాటం.. ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు

18 Aug, 2021 09:18 IST|Sakshi
సంభాల్‌ నియోజకర్గ ఎంపీ షఫీక్‌ ఉర్‌ రెహ్మాన్‌ బర్ఖ్‌

సంభాల్‌/లక్నో: ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ఒకరు తాలిబన్లకు అనుకూలంగా మాట్లాడడం వివాదాస్పదంగా మారింది. ఆయనపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. సంభాల్‌ నియోజకర్గ ఎంపీ షఫీక్‌ ఉర్‌ రెహ్మాన్‌ బర్ఖ్‌ తాజాగా అఫ్గాన్‌ పరిణామాలపై తాజాగా మీడియాతో మాట్లాడారు. అఫ్గాన్‌ను తాలిబన్లు స్వాధీనం చేసుకోవడాన్ని భారత స్వాతంత్య్ర పోరాటంతో పోల్చారు. భారతీయుల పోరాటం, తాలిబన్ల పోరాటం దాదాపు సమానమేనని అన్నారు. తాలిబన్లది ఒకరకంగా స్వాతంత్య్ర పోరాటమేనని చెప్పారు.

తమ దేశానికి స్వేచ్ఛ కావాలని తాలిబన్లు కోరుకున్నారని, అనుకున్నది సాధించారని చెప్పారు. అయినా అదంతా అఫ్గానిస్తాన్‌ అంతర్గత వ్యవహారమని స్పష్టం చేశారు. సమాజ్‌వాదీ ఎంపీ షఫీక్‌ ఉర్‌ వ్యాఖ్యలను సీఎం యోగి ఆదిత్యనాథ్‌ తప్పుపట్టారు. ప్రతిపక్ష ఎంపీ సిగ్గులేకుండా తాలిబన్లను సమర్థిస్తున్నారని విమర్శించారు. తాలిబన్లను సమర్థించడం అంటే వారి రాక్షసకాండను సైతం సమర్థించినట్లేనని అన్నారు. మానవత్వానికి మచ్చగా మారిన వారికి మద్దతుగా మాట్లాడుతున్నారంటే అసలు మనం ఎక్కడి వెళ్తున్నట్లు? అని ఆవేదన వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు