Uttar Pradesh: కురువృద్ధ ఎంపీ షఫీకర్ రహ్మాన్ బుర్కే కన్నుమూత

27 Feb, 2024 11:41 IST|Sakshi

సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) ఎంపీ డాక్టర్ షఫీకర్ రహ్మాన్ బుర్కే కన్నుమూశారు. యూపీలోని మొరాదాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తనువు చాలించారు. తన 93 ఏళ్ల తమ తాత ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించిందని ఎంపీ మనుమడు జియావుర్ రహ్మాన్ బుర్కే మీడియాకు తెలిపారు. అనంతరం మొరాదాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేర్పించామని, అక్కడే కన్నుమూశారని తెలిపారు. 

నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, నాలుగుసార్లు ఎంపీగా ఎన్నికైన డాక్టర్ షఫీకర్ రహ్మాన్ బుర్కే 2019లో ఐదోసారి కూడా ఎంపీగా ఎన్నికయ్యారు. వయస్సు, అనుభవం రీత్యా అత్యంత సీనియర్‌ రాజకీయ నేతగానూ గుర్తింపు పొందారు.

డాక్టర్ షఫీకర్ రహ్మాన్ బుర్కే బాబ్రీ మసీదు యాక్షన్ కమిటీ కన్వీనర్‌గానూ వ్యవహరించారు. ఆయన ముస్లింల సమస్యలను లేవనెత్తేవారు. డాక్టర్ షఫీకర్ రహ్మాన్ బార్క్  సమాజ్‌వాదీ పార్టీలో కీలక నేతగా గుర్తింపు పొందారు. ఆయన రాజకీయ ప్రయాణం 60 ఏళ్లకు పైగా సుదీర్ఘకాలం పాటు సాగింది.

whatsapp channel

మరిన్ని వార్తలు