సియాచిన్‌ హిమ శిఖరాన్ని అధిరోహించి ...రికార్డు సృష్టించిన వికలాంగులు

13 Sep, 2021 13:18 IST|Sakshi

న్యూఢిల్లీ: కొందరూ అన్ని సక్రమంగా ఉండి ఏం సాధించలేక నిరాశ నిస్ప్రుహలకి లోనైన ఆత్మనూన్యత భావంతో బాధపడుతుంటారు. అలాంటి వారికి కనువిప్పు కలిగించేలా వికలాంగులు ప్రంపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన హిమ శిఖరాలలో ఒకటైన సియాచిన్‌ హిమశిఖరాన్ని అధిరోహించి ప్రపంచ రికార్డు సృష్టించారు. 

వివరాల్లోకెళ్లితే.... ఎనిమిది మంది వికలాంగుల బృందం ఆదివారం 15 వేల అడుగుల ఎత్తులో ఉన్న సియాచిన్‌ హిమ శిఖరం దగ్గర కుమార్‌ పోస్ట్‌ వద్దకు చేరుకుని ప్రపంచ రికార్డ్‌ సృష్టించారు.  ప్రపంచంలోనే క్లిష్టమైన హిమనీనదాల్లో ఒకటైన సియాచిన్‌ హిమనీనదాన్ని అధిరోహించిన తొలి వికలాంగ బృందంగా నిలిచింది. భారత సైన్యం  కాంకర్‌ ల్యాండ్‌ వాటర్‌ ఎయిర్‌(క్లావ్‌)ని ట్రెక్కింగ్‌ చేయడానికీ సూత్రప్రాయంగా అనుమతి ఇచ్చింది. దీంతో క్లావ్‌, మాజీ ఆర్మీ అధికారులు ఏప్రిల్‌ నెలలో ఈ ట్రెక్కింగ్‌లో  వికలాంగులు పాల్గొనేలా దేశవ్యాప్తంగా ప్రచారం చేశారు.  మాజీ పారా ఆఫీసర్‌ మేజర్‌ వివేక్‌ జాకబ్‌ నేతృత్వంలో 20 మందికి శిక్షణ ఇచ్చి ఎనిమిది మందితో కూడిన బృందాన్ని ఎంపిక చేసినట్లు భారత సైన్యం పేర్కొంది(చదవండి: 70 ఏళ్లుగా అడవిలోనే.. కర్పూరమే ఆహారంగా)

ఈ మేరకు స్వాతంత్య్ర దినోత్సవం రోజున "ఆపరేషన్‌ బ్లూ" పేరుతో ఈ యాత్ర ప్రారంభించారు. దీన్ని క్లావ్‌ టీమ్‌, భారతసైనిక దళలు వికాంగుల సాధికారత దిశగా ప్రోత్సహించేలా ఈ ఆపరేషన్‌ని అమలు చేశారు.  ఆపరేషన్‌ బ్లూ విజయవంతమవ్వడమే కాక ప్రపంచ రికార్డు సృష్టించారంటూ ...భారత సైన్య్ం ట్వీట్‌ చేసింది. 

(చదవండి: పని చేస్తున్న చోటే తింటే చాలా ప్రమాదమట..!)

మరిన్ని వార్తలు