SpiceJet Flight Emergency Landing: ఒకే రోజులో రెండో ఘటన.. ముంబైలో మరో స్పైస్ జెట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌

5 Jul, 2022 18:59 IST|Sakshi

ముంబై: ఇటీవల స్పైస్ జెట్ విమానాలను అత్యవసర ల్యాండింగ్ చేస్తున్న ఘటనలు తరుచుగా జరుగుతున్నాయి. గత 17 రోజుల్లో స్పైస్ జెట్‌లో భద్రత సమస్యల కారణంగా ఆరు ఘటనలు చోటుచేసుకోగా తాజాగా గుజరాత్‌లోని కాండ్లా నుంచి బయలుదేరిన స్పైస్‌ జెట్ విమానం మంగళవారం ముంబైలో ఎమర్జెన్సీ ల్యాండ్ అయింది. విమానం గాల్లో ఉండగా విండ్‌షీల్డ్ ఔటర్‌ పేన్ పగలడంతో ముంబైలో అత్యవసర ల్యాండింగ్‌ చేశారు. అయితే ప్రయాణికులు, సిబ్బంది క్షేమంగా ఉన్నారని ఎయిర్‌లైన్స్ తెలిపింది.

‘గుజరాత్‌లోని కాండ్లా నుంచి SG 3324ను నడుపుతున్న స్పైస్‌ జెట్ Q400 విమానం గాల్లో విహారం చేస్తున్న సమయంలో P2 వైపు విండ్‌షీల్డ్ ఔటర్ పేన్ పగిలింది. విమానం సురక్షితంగా ముంబయిలో ల్యాండ్ అయింది' అని స్పైస్‌ జెట్ ప్రతినిధి తెలిపారు. కాగా ఒకే రోజు స్సైస్‌జెడ్‌ విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ అవ్వడం ఇది రెండో ఘటన. మంగళవారం ఉదయం ఢిల్లీ నుంచి దుబాయ్‌ వెళ్లే మరో స్సైస్‌జెట్‌ విమానంలో సాంకేతిక సమస్యలు ఏర్పడింది. ఇంధన సూచిక సరిగా పనిచేయకపోవడంతో కరాచీలో అత్యవసరంగా ల్యాండ్‌ చేశారు.
చదవండి: స్పైస్‌ జెట్‌లో తలెత్తిన సాంకేతిక లోపం...కరాచీలో అత్యవసర ల్యాండింగ్‌

మరిన్ని వార్తలు