దేశంలో 50వేలకు చేరువలో మరణాలు

16 Aug, 2020 09:56 IST|Sakshi

సాక్షి, ఢిల్లీ : భారత్‌లో కరోనా వైరస్‌ రోజురోజుకు మరింత విజృంభిస్తోంది. గడిచిన వారం రోజులుగా 60వేలకు పైగా తగ్గకుండా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 63,489 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్యారోగ్యశాఖ ఆదివారం ఉదయం హెల్త్‌ బులెటిన​ విడుదల చేసింది. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసులు సంఖ్య 25, 89,682గా ఉంది. తాజాగా 944 మంది  కరోనాతో మృతి చెందగా.. మొత్తం మరణాల సంఖ్య 49,980కు చేరింది.

గత 24 గంటల్లో కొత్తగా 53,322 మంది డిశ్చార్జి అవ్వగా.. కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నవారి సంఖ్య 18,62,258 మంది ఉన్నారు. దేశంలో ప్రస్తుతం 6,77,444 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. దేశంలో కరోనా రికవరీ రేటు 71.91 శాతంగా ఉంది. దేశంలో నమోదయిన మొత్తం కేసుల్లో.. యాక్టివ్ కేసుల శాతం 26.16  శాతంగా ఉండగా.. మరణాల రేటు 1.93 శాతానికి తగ్గింది. గడచిన 24 గంటల్లో దేశంలో  7,46,608 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా..  ఇప్పటి వరకు నిర్వహించిన కరోనా వైరస్ నిర్దారణ పరీక్షల సంఖ్య 2,93,09,703గా ఉంది.

మరిన్ని వార్తలు