ఎస్‌బీఐ కస్టమర్లకు హెచ్చరిక!

2 Mar, 2021 17:48 IST|Sakshi

న్యూ ఢిల్లీ: దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మీకు ఖాతా ఉందా? అయితే మీరు కొంచెం జర జాగ్రత్తగా ఉండండి. మోసగాళ్లు ఎస్‌బీఐ ఖాతాదారులను టార్గెట్ చేసుకొని వల విసురుతున్నారు. సైబర్ నేరాలు పెరిగిపోతున్న నేపథ్యంలో ఎస్‌బీఐ అధికారులు తమ కస్టమర్లను అలర్ట్ చేసింది. ఎస్‌బీఐ కస్టమర్లు రూ.9,870 విలువైన ఎస్‌బీఐ క్రెడిట్ పాయింట్లను రిడీమ్ చేసుకోవాలని హ్యాకర్లు అనుమానాస్పద టెక్స్ మెసేజ్‌లు పంపిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మెసేజ్‌లో ఉన్న లింకుపై క్లిక్ చేసి పాయింట్లు రిడీమ్ చేసుకోవాలని మోసగాళ్లు ఎస్‌బీఐ కస్టమర్లకు మెసేజ్ పంపుతున్నట్లు న్యూ ఢిల్లీకి చెందిన సైబర్ పీస్ ఫౌండేషన్, సైబర్ సెక్యూరిటీ థింక్ ట్యాంక్ తెలిపింది.

మొబైల్ కు వచ్చిన మెసేజ్ ను క్లిక్ చేసినట్లయితే మీకు నకిలీ వెబ్‌సైట్‌కు ఓపెన్ అవుతుంది. వెబ్‌సైట్ ల్యాండింగ్ పేజీలో పాయింట్లు రిడీమ్ చేసుకోవడానికి పేరు, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్, ఇ-మెయిల్, పుట్టిన తేదీ, కార్డ్ నంబర్, సీవీవీ, ఎంపిన్ వంటి వ్యక్తిగత ఆర్థిక సమాచారాన్ని సమర్పించాలని కోరుతుంది. ఇందులో మీరు కనుక ఎస్‌బీఐ విరాలను సమర్పిస్తే ఇక అంతే సంగతులు మీ డేటాను మోసగాళ్లు తస్కరించి మీ బ్యాంక్ అకౌంట్‌లోని డబ్బులు కొట్టేస్తారు. హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, చెన్నై, అహ్మదాబాద్‌లో ఉండే ఎస్‌బీఐ కస్టమర్లను మోసగాళ్లు టార్గెట్ చేసినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. అందువల్ల మీరు ఇలాంటి మెసేజ్‌లతో జర జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. లేకపోతే మీ ఖాతా ఖాళీ అయ్యే అవకాశం ఉంది. 

చదవండి:

రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్

భారీగా పడిపోయిన బంగారం ధరలు 

మరిన్ని వార్తలు