అన్నీ జరుగుతాయా ఏంటి..

21 Dec, 2020 09:48 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : వచ్చే ఏడాది నుంచి సిగరెట్‌ ముట్టనే ముట్టను.. మందు మొహమే చూడను.. చికెన్‌ మానేస్తా.. మటన్‌ మానేస్తా.. ఎక్సర్‌సైజ్‌ చేసేస్తా.. మంచోడిగా మారిపోతా.. ఇలా కొత్త ఏడాది వచ్చినప్పుడల్లా చాలా అనుకుంటాం.. మనసులో ఒట్టు పెట్టేసుకుంటాం.. అయితే.. ఈ కొత్త ఏడాదులు వచ్చిపోతూనే ఉంటాయి.. ఒట్లు తీసి గట్ల మీద పెట్టేస్తునే ఉంటాం.. ఇక ఈ ఏడాది సంగతి చెప్పనక్కర్లేదు.. అనుకున్నదానికంతా రివర్స్‌ అయింది.

మరికొన్ని రోజుల్లో 2021 వచ్చేస్తోంది.. మన దగ్గర మొదలైందో లేదో గానీ.. అమెరికావోళ్లు మాత్రం అప్పుడే అది చేయాలి ఇది చేయాలి అని ప్రతిజ్ఞలు మొదలుపెట్టేశారు. ఎక్కువగా ఈ ఏడాది ఇంట్లోనే ఉండటం.. సోషల్‌ డిస్టెన్స్‌.. దీనికితోడు జంక్‌ ఫుడ్‌ వంటివి బాగా లాగించేసి.. బొజ్జలు పెంచిన నేపథ్యంలో కొత్త సంవత్సరంలో దాన్ని తగ్గించే దిశగానే అలా చేస్తాం.. ఇలా చేస్తాం అని అనుకున్నారట..కొందరు రెండు మూడు గోల్స్‌ పెట్టుకున్నారంట.. దీనికి సంబంధించిన వివరాలను స్టాటిస్టా గ్లోబల్‌ కన్జ్యూమర్‌ సర్వే వెల్లడించింది.


1. ఎక్సర్‌సైజ్‌ ఎక్కువగా చేస్తాం  
2. హెల్దీఫుడ్‌తింటాం.. 
3. బంధుమిత్రులతో ఎక్కువ సమయం గడుపుతాం.. 
4. బరువును తగ్గిస్తాం 
5.పొదుపుగా జీవిస్తాం
6. సోషల్‌ మీడియాను చూడటం తగ్గిస్తాం..
7. ఉద్యోగంలో సామర్థ్యాన్ని పెంచుకుంటాం
8. జాబ్‌లో పని ఒత్తిడిని తగ్గించుకుంటాం.. 
9. సిగరెట్‌ మానేస్తాం
10. మందు తగ్గిస్తాం 

ఇంతకీ మీరేమనుకుంటున్నారు.. ఒకవేళ అనుకున్నా.. చేసే అలవాటు మీకుందా.. లేకుంటే.. ఎప్పట్లాగే.. ఇదే డైలాగ్‌ కొడతారా.. : సరె సర్లే చాలా అనుకుంటాం.. ఎక్సర్‌సైజ్‌ ఎక్కువగా చేస్తాం 

మరిన్ని వార్తలు