పాలు ఇస్తున్న మేకపోతు

29 May, 2022 08:42 IST|Sakshi

యశవంతపుర: మేకపోతు పాలు ఇస్తున్న విచిత్రం హావేరి జిల్లా హనగల్‌ తాలూకా నరేగల్‌ గ్రామంలో జరిగింది. చమన్‌ షావలి అనే గ్రామస్తుడు ఒక మేక పోతును సాకుతున్నారు. ఏడాదిన్నర వయస్సు ఉన్న ఈ మేకపోతు కొద్దిరోజులుగా పాలు ఇస్తోందని చెప్పాడు. చుట్టుపక్కలవారు మొదట నమ్మలేదు. దీంతో వారి ముందే పాలు పితకడంతో చూసినవారు ఆశ్చర్యపోయారు. కొన్నిసార్లు హార్మోన్లలో మార్పుల వల్ల ఇలా జరుగుతుందని పశువైద్యాధికారులు చెప్పారు. 

(చదవండి: కొడుకు పుట్టాడన్న సంతోషం.. అదే రోజు రాత్రి స్వీట్లు తీసుకొని..)

మరిన్ని వార్తలు