పేరెంట్స్‌ మీటింగ్‌కి బాయ్‌ఫ్రెండ్‌.. బిత్తరపోయిన ఉపాధ్యాయులు

14 Dec, 2022 07:39 IST|Sakshi

సాక్షి, బనశంకరి:  ఇటీవల రోజుల్లో విద్యార్థుల ప్రవర్తనతో తల్లిదండ్రులు హడలిపోతున్నారు. ఓ బాలిక పేరెంట్స్‌ మీటింగ్‌కు తన బాయ్‌ ఫ్రెండ్‌ను తీసుకువచ్చి తన సోదరుడు అంటూ చెప్పిన ఘటన బెంగళూరు నగరంలో వెలుగులోకి వచ్చింది. మీటింగ్‌కు తల్లిదండ్రులకు బదులుగా విద్యార్థిని బాయ్‌ఫ్రెండ్‌ను తీసుకురావడంతో ఉపాధ్యాయులు బిత్తరపోయారు.

ఇద్దరి వాలకాన్ని అనుమానించిన ఉపాధ్యాయులు వేర్వేరుగా విచారణ చేశారు. పదే పదే ప్రశ్నించగా తన కజిన్‌ బ్రదర్‌ అని, ఆ వ్యక్తిని అడగ్గా తన సిస్టర్‌ అంటూ చెప్పాడు. ఇద్దరి మాటలతో అయోమయానికి గురైన పాఠశాల పాలక మండలి విద్యార్థిని తల్లిదండ్రులకు విషయం తెలిపి జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. నగరంలో ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయని, తల్లిదండ్రులు పిల్లలపై దృష్టి సారించాలని క్యామ్స్‌ అధ్యక్షుడు శశికుమార్‌ తెలిపారు. 

(చదవండి: చికెన్‌ రోల్‌ లేదని.. హోటల్‌కు నిప్పు)

మరిన్ని వార్తలు :

మరిన్ని వార్తలు