క్లాస్‌రూంలో పుష్ప ‘శ్రీవల్లి’ స్టెప్పులు! ప్రధానోపాధ్యాయురాలిపై వేటు

7 May, 2022 11:22 IST|Sakshi

బరంపురం: ‘పుష్ప’మేనియా గురించి ప్రత్యేకంగా చెప్పాలా?.. అల్లు అర్జున్‌ సినిమా ఎఫెక్ట్‌ ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే తాజాగా ఓస్కూల్‌లో పోరగాళ్లు శ్రీవల్లి పాటకు పుష్పరాజ్‌ లెవల్‌లోనే చిందులేశారు. దీంతో ఆ స్కూల్‌ ప్రధానోపాధ్యాయురాలిపై వేటు వేశారు అధికారులు. 

ఒడిశాలోని గంజాం జిల్లాలో హింజిల్‌కట్‌ బ్లాక్‌లో ఉన్న ఓ స్కూల్లో విద్యార్థులు ‘పుష్ప’ పాటకు క్లాస్‌రూములోనే డ్యాన్స్‌ చేశారు. దాంతో స్కూల్‌ ప్రధానోపాధ్యాయురాలిని అధికారులు సస్పెండ్‌ చేశారు. బారాముందాలి హైస్కూల్‌లో పదో తరగతి విద్యార్థులు కొందరు టీచర్లు లేని సమయంలో డిజి క్లాస్‌రూమ్‌లోని ఎల్‌ఈడీ స్క్రీన్‌పై పుష్ప సినిమాలోని ‘శ్రీవల్లి...’ పాటకు చిందేశారు.

అంతటితో ఆగకుండా మరికొన్ని సినిమా పాటలు వేసుకుని.. తెగ చిందులు వేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్‌ అయ్యాయి. దీంతో విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉన్నారంటూ ప్రధానోపాధ్యాయురాలు సుజాతపై వేటు వేశారు జిల్లా విద్యాధికారులు.

మరిన్ని వార్తలు