Vagsheer Submarine Launch: 20న ‘వాగ్‌షీర్‌’ జలప్రవేశం

16 Apr, 2022 07:34 IST|Sakshi

ముంబై: మజగావ్‌ డాక్‌  షిప్‌బిల్డర్స్‌ లిమిటెడ్‌(ఎండీఎల్‌) నిర్మించిన వాగ్‌షీర్‌ జలాంతర్గామి ఈ నెల 20న ముంబై సముద్ర తీరంలో జలప్రవేశం చేయనుందని అధికారులు శుక్రవారం తెలిపారు. పీ75 స్కార్పిన్‌ ప్రాజెక్టులో భాగంగా ఈ ఆరో సబ్‌మెరైన్‌ను నిర్మించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి తమకు రూ.46,000 కోట్ల విలువైన ఆర్డర్‌ దక్కిందని, ఇందులో 6 సబ్‌మెరైన్‌ ప్రాజెక్టులు, 15 బ్రేవో డిస్ట్రాయర్స్, 17 అల్ఫా స్టీల్త్‌ ఫ్రిగేట్స్‌ ఉన్నాయని ఎండీఎల్‌ చైర్మన్, ఎండీ నారాయణ్‌ ప్రసాద్‌ తెలిపారు.

ఇప్పటికే 4 జలాంతర్గాములు, ఒక డిస్ట్రాయర్స్‌ సరఫరా చేశామని వివరించారు. పీ75 స్కార్పిన్‌ ప్రాజెక్టులో వాగ్‌షీర్‌ ఆఖరి జలాంతర్గామి. ఐదో జలాంతర్గామి అయిన ‘వగీర్‌’ సీ ట్రయల్స్‌ కొనసాగుతున్నాయి. ఈ ప్రాజెక్టులో భాగంగా ఐఎన్‌ఎస్‌ కల్వరీ, ఐఎన్‌ఎస్‌ ఖాందేరి, ఐఎన్‌ఎస్‌ కరాంజ్, ఐఎన్‌ఎస్‌ వేలా సబ్‌మెరైన్లు ఇప్పటికే విధుల్లో చేరాయి.

మరిన్ని వార్తలు