బీజేపీకి షాక్‌.. అమిత్‌ షాకు క్రీడా శాఖ ఇవ్వాల్సింది.. షాకింగ్‌ కామెం‍ట్స్‌

5 Jun, 2022 08:10 IST|Sakshi

ఐపీఎల్‌ అంటే ప్రపంచవ్యాప్తంగా క్రికెట్‌ అభిమానులకు కిక్‌ ఇచ్చే గేమ్‌. రిచ్‌ టోర్నీగా పేరొందిన భారత ప్రీమియర్‌ లీగ్‌లో పాల్గొనేందుకు వివిధ దేశాల క్రికెటర్లు సైతం ఎంతో ఆసక్తిని చూపిస్తుంటారు. అయితే, ఈ ఏడాది ఐపీఎల్‌లో మ్యాచ్‌ ఫిక్సింగ్‌ జరిగిందంటూ బీజేపీ సీనియర్‌ నేత, మాజీ ఎంపీ సుబ్రమణ్య స్వామి కామెంట్స్‌ చేయడం చర్చనీయాంశంగా మారింది. 

అయితే, సొంత పార్టీ నేతలు, పార్టీ విధానాలపై అప్పుడప్పుడు విమర్శలు చేసే సుబ్రమణ్య స్వామి తాజాగా ఐపీఎల్‌, అమిత్‌ షా కుమారుడు జై షాపై షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు.  సుబ్రమణ్య స్వామి.. ఐపీఎల్‌లో మ్యాచ్‌ ఫిక్సింగ్‌ జరిగినట్టు నిఘా సంస్థలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్టు తెలిపారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా కుమారుడు జై షా బీసీసీఐపై ఒక నియంతలా పెత్తనం చెలాయిస్తున్నాడని ట్విట్టర్‌ వేదికగా సంచలన కామెంట్స్‌ చేశారు. 

మరో అడుగు ముందుకేసి.. ఐపీఎల్‌ మ్యాచ్‌ ఫిక్సింగ్‌ వ్యవహారంపై ప్రభుత్వం ఎలాంటి దర్యాప్తు చేబట్టబోదని చెప్పడం చర్చనీయాంశంగా మారింది. అందుకే దీనిపై కోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా.. ఈ ఏడాది ఐపీఎల్‌లో కొత్త ప్రాంఛైజీకి చెందిన గుజరాత్‌ టైటాన్స్‌ కప్‌ కొట్టింది. అందరి అంచనాలకు తల కిందులు చేస్తూ ఐపీఎల్‌ ప్రారంభ మ్యాచ్‌ నుంచీ గుజరాత్‌ వరుస విజయాలతో టాప్‌లోనే కొనసాగిన విషయం తెలిసిందే. 

ఇదిలా ఉండగా, సుబ్రమణ్య స్వామి అంతుకుముందు.. జమ్ముకశ్మీర్‌లో పండిట్లు, హిందువుల హత్యలను ఆపడంతో హెం మంత్రి అమిత్‌ షా విఫలమయ్యారని ఆరోపించారు. అమిత్‌ షాకు హోంశాఖ కంటే క్రీడాశాఖనే బాగా సెట్‌ అవుతుందని సెటైరికల్‌ కామెంట్స్‌ చేశారు. అలాగే, జ్ఞానవాపీ మసీదు వివాదంపై కూడా అమిత్‌ షాను టార్గెట్‌ చేసిన సుబ్రమణ్య స్వామి.. మసీదు అంశానికి సంబంధించి షా అనవసరంగా తప్పుడు అంచనాలను పెంచుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఇది కూడా చదవండి: ‘మీ సీనియర్‌ నాయకుడి అవినీతిని బట్టబయలు చేస్తాం’

మరిన్ని వార్తలు