ఒక్కసారిగా విరిగిపడిన కొండచరియలు.. పరుగులు పెట్టిన ‍ప్రయాణికులు!

22 Sep, 2022 13:10 IST|Sakshi

డెహ్రాడూన్‌: భారీ వర్షాలు, వరదల కారణంగా పలు ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడుతున్నాయి. ఉత్తర్‌ప్రదేశ్‌, ప్రయాగ్‌రాజ్‌లోని తర్సాలి గ్రామ సమీపంలో గురువారం ఉదయం ఒక్కసారిగా కొండచరియలు విరిగిపడ్డాయి. జాతీయ రహదారి 109 పూర్తిగా మూసుకుపోయింది. దీంతో రెండు వైపుల కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని స్థానికులు హెచ్చరించటం వల్ల ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. కొండచరియలు విరిగిపడుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.  

జాతీయ రహదారిపై పడిన శిథిలాలను తొలగించి వాహన రాకపోకలను త్వరలోనే అనుమతిస్తామని జిల్లా కలెక్టర్‌ మయూర్‌ దీక్షిత్‌ తెలిపారు. ‘ప్రయాణికులు సురక్షిత ప్రాంతాల్లోనే ఉన‍్నారు. హైవేను తిరిగి తెరుస‍్తున్నాం. శిథిలాలు తొలగించిన వెంటనే వాహనాలను అనుమతిస్తాం’ అని చెప్పారు. మరోవైపు.. కేదార్‌నాథ్‌ వెళ్లే భక్తులు.. రుద్రప్రయాగ్, తిల్వారా, అగస్త్యముని, గుప్తకాశి వంటి ప్రాంతాల్లోనే ఆగిపోవాల్సి వచ్చింది.

ఇదీ చదవండి: టిక్‌టాక్‌ ప్రేమ.. భర్తకు ప్రియురాలితో పెళ్లి చేసిన భార్య

>
మరిన్ని వార్తలు