హఠాత్తుగా పెరిగిన నది ఉధృతి... ఏకంగా 14 కార్లు గల్లంతు

8 Aug, 2022 16:13 IST|Sakshi

మధ్యప్రదేశ్‌: గత కొన్ని రోజులుగా కురిసిన భారీ వర్షాలకు మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్‌ జిల్లాలో సుక్ది నది ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చింది. ఐతే కొన్ని కుటుంబాలు ఆదివారం కదా అని సరదాగా గడుపుదామని సుక్ది నదికి సమీపంలోని కట్కూట్ అడవికి వచ్చారు. అకస్మాత్తుగా నది ఉప్పెనలా ప్రవహించడంతో దాదాపు 50 మంది ఈ ప్రాంతంలో చిక్కుకుపోయారు. ఆ నది ప్రవాహధాటికి సుమారు 14 కార్లు కొట్టకుపోయాయి. దీంతో మహిళలు పిల్లలతో సహ 50 మంది సురక్షిత ప్రాంతాలకు వెళ్లి అక్కడ తలదాచుకున్నారు. ఈ ఘటనతో వెంటనే అప్రమత్తమైన స్థానిక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సదరు వ్యక్తులను రక్షించే ప్రయత్నాలు చేపట్టారు.

గత కొద్దిరోజులుగా కురిసిన వర్షాలకు ఈ నది అకస్మాత్తుగా ఉధృతంగా ప్రవహించడం మొదలైందని పోలీస్‌ అధికారి జితేందర సింగ్‌ పవార్‌ పేర్కొన్నారు. ఎస్‌యూవీ కార్లతో సహా సుమారు 14 కార్లు ఈ నది ఉదృతికి కొట్టుకుపోయాయిని చెప్పారు. అంతేకాదు వాటిలో ఒక ఎస్‌యూవీ కారుతో సహ దాదాపు 10 కార్లను ట్రాక‍్టర్‌ సాయంతో బయటకు తీశామని చెప్పారు.

అంతేకాదు మూడు కార్లు సుదూర ప్రాంతాలకు కొట్టుకుపోయాయని, మరో కారు వంతెన వద్ద ఉన్న హోలులో ఇరుక్కుపోయిందని చెప్పారు. ఐతే ఆ కార్ల లోపలికి నీళ్లు చేరిపోవడంతో పనిచేయకుండా మోరాయించాయిని తెలిపారు. దీంతో తాము వారిని వేరే వాహనాల్లో ఇళ్లకు పంపించినట్లు వెళ్లడించారు. అంతేకాదు సదరు పర్యాటకులు ఇలాంటి ప్రదేశాల్లో ఈ సుక్ది నది ఉప్పెనలా ముంచేస్తుందని హెచ్చరిక బోర్డులను  కూడా పెట్టాల్సిందిగా స్థానిక పోలీసులను  కోరినట్లు అదికారులు తెలిపారు.

(చదవండి: Viral: 16 ఏళ్ల బాలుడి ముక్కు కొరికేసిన రాజకీయ నేత.. అంత కోపం దేనికో?)

మరిన్ని వార్తలు