Karnataka CM Bommai: కిచ్చా సుదీప్ చెప్పింది కరెక్ట్.. కర్ణాటక సీఎం బసవరాజ్‌ బొమ్మై

28 Apr, 2022 15:31 IST|Sakshi

కన్నడ స్టార్‌ కిచ్చా సుదీప్‌, బాలీవుడ్‌ హీరో అజయ్‌ దేవగణ్‌ మధ్య తలెత్తిన హిందీ భాషా వివాదం ప్రస్తుతం కర్ణాటక ముఖ్యమంత్రి వరకు చేరింది. కన్నడ సూపర్‌స్టార్‌ సుదీప్‌కు మద్దతుగా సీఎం బసవరాజ్‌ బొమ్మై నిలిచారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భాషా ప్రాతిపదికన రాష్ట్రాలు ఏర్పడ్డాయని, కాబట్టి ప్రాంతీయ భాషలు చాలా ముఖ్యమైనవని పేర్కొన్నారు. సుదీప్‌ మాటలు సరైనవేనని, దానిని అందరూ అర్థం చేసుకొని గౌరవించాలని సీఎం బొమ్మై సూచించారు. కాగా ఇప్పటికే కర్ణాటక మాజీ సీఎం సిద్ధ రామయ్య, కాంగ్రెస్‌ నేత డీకే శివకుమార్‌ కిచ్చ సుదీప్‌కు అండగా నిలిచారు.

బాలీవుడ్‌, కన్నడ  సూపర్‌ స్టార్ల మధ్య హిందీ వార్‌ నడుస్తున్న విషయం తెలిసిందే. ముందుగా ఓ సినిమా ఈవెంట్‌లో పాల్గొన్న సుదీప్‌.. దక్షిణాది సినిమాలు బాక్సాఫిస్‌ వద్ద రికార్డులు బద్దలు కొడుతున్నాయని, హిందీలోకి డబ్‌ అయి  బాలీవుడ్‌ సినిమాల కంటే ఎక్కువ వసూళ్లు రాబడుతున్నాయని అన్నారు. అలాగే ఇకపై హిందీ జాతీయ భాషగా ఉండబోదని చెప్పారు. దీంతో సుదీప్‌ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దూమారం రేపాయి. 

సుదీప్‌ వ్యాఖ్యలపై  బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ అజయ్‌ దేవగణ్‌ వ్యంగ్యంగా స్పందించారు. బ్రదర్‌ కిచ్చా సుదీప్... మీ అభిప్రాయం ప్రకారం హిందీ జాతీయ భాష కానప్పుడు... మీ మాతృభాష సినిమాలను హిందీలోకి ఎందుకు డబ్ చేస్తున్నారని ప్రశ్నించారు. హిందీ ఇంతకమందు, ఇప్పుడు, ఎప్పటికీ మన జాతీయ భాషే. జన గణ మన' అని ట్వీట్ చేశారు. మరోవైపు వీరిద్దరి మాటల యుద్ధంపై పలువురు తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.
చదవండి👉 Kichcha Sudeep Vs Ajay Devgan: చిచ్చు పెట్టిన హిందీ భాష, స్టార్‌ హీరోల మధ్య ట్వీట్ల వార్‌

మరోవైపు తాను మాట్లాడిన మాటలు ట్రాన్స్‌లేషన్‌ పొరపాటు వలన తప్పుగా అర్థం చేసుకున్నారనీ సుదీప్‌ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ‘అజయ్‌ సార్‌.. మీరు హిందీలో చేసిన ట్వీట్‌ నాకు అర్థం అయ్యింది. అందరం హిందీని గౌరవిస్తాము. కాబట్టి హిందీని ప్రేమించాము, నేర్చుకున్నాను. గౌరవించాము. మనమందరం నేను హిందీ భాషను గౌరవిస్తాను, ప్రేమిస్తాను, కేవలం ట్రాన్స్‌లేషన్‌ వల్ల పొరపాటు జరిగింది. కానీ నేను ఇప్పుడు కన్నడలో రిప్లై ఇస్తే పరిస్థితి ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నా. మనమంతా కూడ భారతదేశానికి చెందిన వాళ్లమే కదా సార్‌’  అంటూ రీట్వీట్‌ చేశారు. 

అలాగే ‘ మన దేశంలోని ప్రతి భాషను నేను ప్రేమిస్తాను సార్. నేను ఆ మాటలను పూర్తిగా భిన్నమైన సందర్భంలో చెప్పాను. అది మీ దగ్గరకు వేరే రకంగా చేరింది. త్వరలో మిమ్మల్ని కలుస్తానని ఆశిస్తున్నాను. అప్పుడు అసలేం జరిగిందో మీకు వివరిస్తాను. ఇది ఎవరినీ బాధపెట్టడానికి, రెచ్చగొట్టడానికి లేదా ఇలాంటి చర్చను ప్రారంభించడానికి కాదు. ఇక ఈ అంశం ఇక్కడితో ముగిసిపోవాలని ఆశిస్తున్నాను. అనువాదం, వివరణలు, దృక్కోణాలు అసలు మేటర్ సర్… పూర్తి విషయం తెలియకుండా స్పందించకపోవడానికి కారణం అదే దీనికి నేను మిమ్మల్ని నిందించను. ఒక సృజనాత్మక కారణంతో నేను మీ నుంచి ట్వీట్‌ను స్వీకరించి ఉంటే బహుశా అది సంతోషకరమైన క్షణం అయ్యేది” అంటూ సుదీర్ఘ వివరణ ఇచ్చాడు.

మరిన్ని వార్తలు