మీకు ఎందుకు అంత తొందర: సుమిత్ర మహాజన్‌

23 Apr, 2021 11:40 IST|Sakshi

న్యూఢిల్లీ: తను చనిపోయినట్లు వస్తున్న తప్పుడు వార్తలపై లోక్‌సభ మాజీ స్పీకర్‌ సుమిత్ర మహాజన్‌ శుక్రవారం స్పందించారు. తను మరణించానో లేదో అధికారికంగా నిర్ధారణ చేసుకోకుండా అంత తొందర ఏంటని ప్రశ్నించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ‘నా మరణం గురించి ఇండోర్‌ అధికారుల నుంచి సమాచారం తీసుకోకుండా న్యూస్‌ ఛానల్స్‌ చనిపోయినట్లు ఎలా చెబుతాయి. నా మేనకోడలు థరూర్‌ను ట్విటర్‌లో ఖండించారు. కానీ ధృవీకరించకుండా ప్రకటించాల్సిన అవసరం ఏముంది’. అని ప్రశ్నించారు.

కాగా సుమిత్ర మహాజన్‌ చనిపోయారని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత శశిథరూర్‌ ఆమెకు సంతాపం ప్రకటించారు. ఈ మేరకు గురువారం ట్వీట్‌ చేశారు. అయితే సుమిత్ర ఇంకా బతికే ఉందని, ఆరోగ్యంగా ఉందని ఆమె మేనకోడలు, బీజేపీ నేతలు చెప్పడంతో వెంటనే శశిథరూర్‌ ఆ ట్వీట్‌ను డిలీట్‌ చేశారు. కానీ అప్పటికే ఆ ట్వీట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఆయనతోపాటు కొన్ని మీడియా ఛానళ్లు సైతం తప్పుగా ప్రసారం చేశాయి. అయితే నిజం తెలిశాక ఆమె చనిపోలేదని మళ్లీ పేర్కొన్నాయి. ఇక మహజన్‌ కుమారుడు మందర్ సైతం తన తల్లి ఆరోగ్యంపై ఓ వీడియో పెట్టారు., తన తల్లి బాగానే ఉందని, ఆమె గురించి వస్తున్న తప్పుడు వార్తలకు నమ్మవద్దని ప్రజలను కోరారు.

చదవండి: రైల్లో లైంగికదాడి; సీఎం పళనికి మద్రాస్‌ కోర్టు నోటీసులు  

>
మరిన్ని వార్తలు