అమ్మాయిలూ ‘జట్టు విరబోసుకుని రావొద్దు’ ‘సెల్ఫీలు దిగొద్దు’

23 Aug, 2021 19:02 IST|Sakshi

సుందర్‌వతి మహిళా మహావిద్యాలయం వివాదాస్పద నిర్ణయం

పాట్నా: ‘కళాశాలకు వస్తుంటే తల విరబూసుకుని జట్టు వేసుకోకుండా వస్తే ఇకపై అనుమతి లేదు. హీరోయిన్‌ మాదిరి తయారై వస్తే కళాశాలలోకి అడుగు పెట్టేదే లేదు’ అని బిహార్‌ భగల్‌పూర్‌లో ఉన్న సుందర్‌వతి మహిళా మహావిద్యాలయం నిర్ణయం తీసుకుంది. విద్యా ఆవరణలో క్రమశిక్షణ, పద్ధతిగా ఉండాలనే ఉద్దేశంతో ఆ విద్యాలయం తీసుకున్న ఈ నిర్ణయం వివాదాస్పదమవుతోంది. ఇటీవల విద్యాలయ ప్రిన్సిపల్‌ పలు నిబంధనలు అమలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వాటిలో అమ్మాయిలకు డ్రెస్‌ కోడ్‌తో పాటు అలంకరణ, వేషధారణ పలు విషయాలపై పరిమితులు విధిస్తూ నిర్ణయం తీసుకుంది.
(చదవండి: జర చూసి తినండి.. పిజ్జాలో ఇనుప నట్లు, బోల్టులు)

  • కళాశాలకు వచ్చే విద్యార్థినులు కచ్చితంగా జడ వేసుకోవాలి. జుట్టు విరబూసుకుని రావొద్దు.
  • కళాశాల గేటు లోపలకి వచ్చాక సెల్ఫీలు, ఫొటోలు దిగవద్దు. 
  • డ్రెస్‌ కోడ్‌ విధిగా పాటించాలి. రాయల్‌ బ్లూ బ్లేజర్‌ లేదా, చలికోటు ధరించాలి. 
  • పైవీ ఏవైనా ఉల్లంఘిస్తే కళాశాలకు అనుమతించరు.

ఈ నిబంధనలను విధిగా పాటించాలని ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొనట్లు ప్రిన్సిపల్‌ ప్రొఫెసర్‌ రమణ్‌ సిన్హా  తెలిపారు. ఈ నిబంధనలపై విమర్శలు రావడంపై కొట్టిపారేశారు. ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకునే ప్రసక్తే లేదు అని స్పష్టం చేశారు. అయితే ఈ నిర్ణయాన్ని ఆర్జేడీ తప్పుబట్టింది. ఇదో తుగ్లక్‌ నిర్ణయమని ఎద్దేవాచే సింది. మరికొన్ని విద్యార్థి సంఘాలు ఈ నిబంధనలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతం ఆ విద్యాలయంలో మొత్తం విద్యార్థులు 1,500మంది ఉన్నారు. 

చదవండి: గుండెల్ని పిండేస్తున్న అమెజాన్‌ వీడియో

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు