రైల్వే బోర్డు కొత్త ఛైర్మన్‌ నియామకం

31 Dec, 2020 17:49 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ:  రైల్వేబోర్డు నూతన ఛైర్మన్‌,  సీఈఓగా సునీత్‌ శర్మను  నియమితులయ్యారు. ఈ మేరకు కేబినెట్ నియామక కమిటీ గురువారం ఆమోదం తెలిపింది. దీంతో  పునర్నిర్మించిన బోర్డు తొలిసీఈవోగా సునీత్‌  వర్మ ఎంపికయ్యారు. ప్రస్తుత ఛైర్మన్‌ వినోద్‌  కుమార్‌ యాదవ్‌ పదవీ కాలం   నేటితో (2020 డిసెంబరు 31) ముగియనుంది.   దీంతో తాజా నియామకం జరిగింది. ఇప్పటికే  వినోద్‌  కుమార్‌ పదవీకాలాన్ని ఒక సంవత్సరం పొడిగించిన సంగతి తెలిసిందే.  కాగా  1978 బ్యాచ్‌కు చెందిన సునీత్‌ శర్మ స్పెషల్ క్లాస్ రైల్వే అప్రెంటిస్ ఆఫీసర్. ఇంతకుముందు రాయబరేలి, మోడరన్ కోచ్ ఫ్యాక్టరీ జనరల్ మేనేజర్‌గాను, పూణే, సెంట్రల్ రైల్వే డివిజనల్ రైల్వే మేనేజర్‌గా విధులు నిర్వహించారు. 

మరిన్ని వార్తలు