అహంకారానికి చోటు లేదు.. అదా సమస్య?

24 Sep, 2021 17:46 IST|Sakshi

సోషల్‌ నెట్‌ వర్కింగ్‌ వెబ్‌సైట్లు ఫేస్‌బుక్, ట్విట్టర్‌లలో సెలబ్రిటీల ‘మనసులోని మాట’లు తాజాగా ఇలా...! 


కాలాన్ని తట్టుకుని...

కొన్ని సంస్థల వయసు (ఏళ్లలో): నోకియా–156; ఎరిక్‌సన్‌–145; నింటెండో–132; జీఈ–129; ఏటీ అండ్‌ టీ–120; ఐబీఎం–106; మోటరోలా–93; శామ్‌సంగ్‌–83; హెచ్‌పీ–82; సోనీ–75; కామ్‌కాస్ట్‌–58; ఇంటెల్‌– 53; మైక్రోసాఫ్ట్‌– 46; యాపిల్‌–45; వెరిజాన్‌–38; డెల్‌–37; సిస్కో–37; అమెజాన్‌–25; నెట్‌ఫ్లిక్స్‌–24; గూగుల్‌–23; అలీబాబా–22; సేల్స్‌ఫోర్స్‌–22; టెస్లా– 18; ఫేస్‌బుక్‌–17; ఎయిర్‌బీఎన్‌బీ–13; ఉబెర్‌–12.
– వాలా అఫ్షార్, డిజిటల్‌ ఇవాంజెలిస్ట్‌


అహంకారానికి చోటు లేదు

తెల్ల మనిషి టీకాకు సరే; కానీ గోధుమ రంగు సర్టిఫికెట్‌కు మాత్రం కాదు! ఇలాంటి అహంకారానికి స్వతంత్ర ప్రపంచంలో ఏ స్థానమూ లేదు. సీఓపీ 26కు యూకే ఆతిథేయ దేశం. వాతావరణ మార్పు గురించి అందరికీ ఉపన్యాసాలిస్తోంది. ప్రభావశీల, సహకార ఒప్పందాలకు పరస్పర గౌరవం అనేది అత్యవశ్యం అని గుర్తించాలి.
– సునీతా నారాయణ్, పర్యావరణవేత్త


అదా సమస్య?

ఇండియా కోవిన్‌ టీకా సర్టిఫికెట్‌ను యూకే జీర్ణించుకోవడం కష్టమే. ఎందుకంటే, క్యూఆర్‌ కోడ్‌ ఉండి, డిజిటల్‌ సంతకం చేసివున్న డాక్యుమెంట్‌ బ్రిటన్‌ చేతిరాత మెమో కంటే కాంతి సంవత్సరాల ముందుంది! అంతేగా, దేశవాళీల చేతిమాత్ర మింగాలంటే కష్టమే.
– శ్రీమోయ్‌ తాలూక్‌దార్, సంపాదకుడు


ఇదీ స్లో‘గన్‌’

1942లో దేశ వ్యాప్త ఉద్యమానికి ఒక స్లోగన్‌ కావాలన్నారు గాంధీ. కొందరు ‘గెట్‌ అవుట్‌’ అని సూచించారు; రాజగోపాలాచారి ‘విత్‌డ్రా’ అని సూచించారు; కానీ ప్రచండమైన సోషలిస్ట్‌ యూసుఫ్‌ మెహెరల్లీ మొదటిసారిగా ‘క్విట్‌ ఇండియా’ అని సూచించారు. సెప్టెంబర్‌ 23న యూసుఫ్‌ మెహెరల్లీ 118వ జయంతి.
– జాయ్‌ భట్టాచార్య, క్విజ్‌ నిర్వాహకుడు


ఐక్యత లేక...

యూకే టీకా ఉదంతం మనకు అర్థం చేయించేది ఏమంటే– కొన్ని లక్షల మంది మాత్రమే ఉన్న బ్రిటిష్‌వాళ్లు, కోట్లాది మంది భారతీయులను వందల సంవత్సరాల పాటు ఎలా పాలించగలిగారన్నది. మనం శత్రువుతో పోరాడటం మాని, మనలో మనమే పోట్లాడుకుంటాం.
– నీలేశ్‌ షా, మార్కెట్‌ విశ్లేషకుడు


చవక భారత్‌

కోవిడ్‌–19ను నిర్ధారించడానికి చేసే ఆర్‌టీ–పీసీఆర్‌ పరీక్షల ధర వివిధ దేశాల్లో ఇలా ఉంది (రూపాయల్లో) : యూఎస్‌ఏ– 11,074; యూకే–8,858; జర్మనీ– 12,900; స్పెయిన్‌– 8,600; ఫ్రాన్స్‌–4,300; ఇండియా–600.
– శుభాంగి శర్మ, సంపాదకురాలు


రాకూడదీ కష్టం

అన్ని పనులనూ ఒంటరిగా చేసుకునే శక్తిమంతమైన, స్వతంత్ర మహిళగా ఉండ టంలోని సమస్య ఏమిటంటే– శక్తి మంత మైన, స్వతంత్ర మహిళగా అన్ని పనులనూ ప్రతిసారీ ఒంటరిగానే చేసుకోవాల్సి రావడం!           
– కవితా రావు, రచయిత్రి 

మరిన్ని వార్తలు