Lok Sabha: లోక్‌ సభలో నోరు మెదపని ఎంపీలు వీరే..

13 Feb, 2024 13:44 IST|Sakshi

దేశంలోని ఓటర్లు తమ సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్తారని ఎంపీలను పార్లమెంట్‌కు పంపిస్తారు. అయితే దీనికి విరుద్దంగా ప్రవర్తించిన ఎంపీలు కూడా ఉన్నారు. ఎంపీల ఐదేళ్ల పదవీకాలం ముగియనుండడంతో త్వరలో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. 

17వ లోక్‌సభలో వివిధ పార్టీలకు చెందిన తొమ్మిది మంది ఎంపీలు తమ పదవీ కాలంలో ఒక్కసారి కూడా సభలో మాట్లాడనేలేదు. లోక్‌సభ సెక్రటేరియట్ నుండి అందిన సమాచారం ప్రకారం ఈ ఎంపీలలో అమితమైన ప్రజాదరణ పొందినవారు కూడా ఉన్నారు. సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన సన్నీ డియోల్, శతృఘ్న సిన్హా సభలో ఒక్కమాట కూడా మాట్లాడలేదు.  మరోవైపు పార్లమెంటు కార్యకలాపాల్లో పాల్గొనని నేతల వర్గంలో శత్రుఘ్న సిన్హా చేరారు.

శత్రుఘ్న సిన్హా ప్రస్తుతం పశ్చిమ బెంగాల్‌లోని అసన్సోల్ నియోజకవర్గానికి చెందిన ఎంపీ. గతంలో శత్రుఘ్న సిన్హా పట్నా సాహిబ్ లోక్‌సభ స్థానానికి ఎంపీగా ఉన్నారు. బాలీవుడ్‌ నటుడు సన్నీ డియోల్ పార్లమెంటులో ఒక్కసారి కూడా ఎటువంటి అంశాన్ని లేవనెత్తలేదు. అదేవిధంగా కర్ణాటకలోని బీజాపూర్ స్థానానికి చెందిన బీజేపీ ఎంపి రమేష్ చంద్రప్ప జిగజినాగి కూడా ఎప్పుడూ సభలో మాట్లాడలేదు. ఉత్తరప్రదేశ్‌లోని ఘోసీ నియోజకవర్గం ఎంపీ అతుల్ రాయ్ కూడా ఈ జాబితాలోనే ఉన్నారు. 
 

whatsapp channel

మరిన్ని వార్తలు