‘కాళేశ్వరం’ విస్తరణ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన సుప్రీం

22 Jul, 2022 12:36 IST|Sakshi

న్యూఢిల్లీ: కాళేశ్వరం ప్రాజెక్టు విస్తరణను వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. దీనిలో భాగంగా కాళేశ్వరం ప్రాజెక్టు విస్తరణపై కేంద్రానికి, తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది సుప్రీంకోర్టు. ఈ మేరకు తదుపరి విచారణను ఈనెల 27వ తేదీకి వాయిదా వేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు విస్తరణను వ్యతిరేకిస్తూ భూనిర్వాసితులు పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. 

మరిన్ని వార్తలు