కరడుగట్టిన నేరస్తుడైనా.. నొప్పి లేకుండా మరణ శిక్షలేమున్నాయ్‌?

21 Mar, 2023 21:31 IST|Sakshi

ఢిల్లీ: మరణశిక్షపై దేశ సర్వోన్నత న్యాయస్థానం ఇవాళ కీలక వ్యాఖ్యలు చేసింది. నొప్పి లేకుండా శిక్షించే విధానాలపై దృష్టి పెట్టాలని కేంద్రాన్ని ఆదేశించింది. కరడుగట్టిన నేరస్తులైనప్పటికీ.. మరణం గౌరవప్రదంగా ఉండాలని, ఇది ఎంతో ముఖ్యమైన అంశమని న్యాయస్థానం అభిప్రాయపడింది. ఉరి శిక్ష విధానం సరైంది కాదన్న అభిప్రాయం వ్యక్తం చేసింది.

ఈ మేరకు ఉరి శిక్షకు బదులు ప్రత్యామ్నాయ మార్గాలపై కమిటీని ఏర్పాటు చేస్తామని, ఇందులో దేశంలోని పలు లా యూనివర్సిటీలను భాగం చేయాలని సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

తొలుత వచ్చేవారానికి ఈ అంశంపై పరిశీలనను వాయిదా వేసింది కోర్టు. అయితే.. అటార్నీ జనరల్‌ విజ్ఞప్తితో మే 2వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. 

మరిన్ని వార్తలు