రఘురామకృష్ణరాజు అరెస్టు వ్యవహారంపై సుప్రీం కీలక వ్యాఖ్యలు

8 Apr, 2022 11:31 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ:  ఎంపీ రఘురామకృష్ణరాజు అరెస్టు వ్యవహారంపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అది అంత ముఖ్యమైన విషయమా? అని పిటిషనర్‌ను ప్రశ్నించింది.  అరెస్ట్‌పై సీబీఐతో విచారణ చేయించాలంటూ దాఖలైన పిటిషన్‌పై అత్యున్నత న్యాయస్థానం ఇలా స్పందించింది. ఇదంతా ముఖ్యమైన విషయమా ? అని ప్రశ్నించిన సుప్రీం కోర్టు.. ముఖ్యమైన విషయం ఉంటే రాత్రి 8 గంటలకు కూడా విచారణ చేపడతాం కదా అని నొక్కి చెప్పింది.

ఇప్పటికే 11 నెలలు గడిచింది కదా అని పిటిషనర్‌ తరపు న్యాయవాదికి గుర్తు చేసింది ధర్మాసనం. ఇదిలా ఉండగా.. రఘురామకృష్ణరాజు అరెస్ట్ వ్యవహారంపై సీబీఐ విచారణ జరపాలంటూ ఆయన తనయుడు భరత్ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై రెండు వారాల్లో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని సీబీఐకి నోటీసులు పంపింది. దానికి మరో రెండు వారాల్లో దానికి సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. ఈ పిటిషన్‌పై తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా వేసింది సుప్రీం కోర్టు.

మరిన్ని వార్తలు