జరిమానా చెల్లించండి.. లేదంటే జైలుకే: సుప్రీంకోర్టు

31 Aug, 2020 12:37 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్‌కు సంబంధించిన కోర్టు ధిక్కరణ కేసులో సుప్రీంకోర్టు సోమవారం తీర్పు వెలువరించింది. క్షమాపణ చెప్పేందుకు నిరాకరించిన ప్రశాంత్‌ భూషణ్‌కు ఒక రూపాయి జరిమానా విధించింది. సెప్టెంబరు 15లోగా జరిమానా చెల్లించని పక్షంలో.. మూడు నెలల జైలు శిక్ష సహా మూడు నెలల పాటు న్యాయవాద వృత్తి నుంచి సస్పెన్షన్ చేస్తామని స్పష్టం చేసింది. కాగా సర్వోన్నత న్యాయవ్యవస్థ పనితీరు, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులు ఇచ్చిన తీర్పులకు సంబంధించి ప్రశాంత్‌ భూషణ్‌ చేసిన రెండు ట్వీట్లు వివాదాస్పదమైన విషయం తెలిసిందే.(చదవండిన్యాయవాది భూషణ్‌కు ఏ శిక్ష విధిస్తేనేం? )

ఈ నేపథ్యంలో అనుజ్‌ సక్సేనా అనే న్యాయవాది ఫిర్యాదు ఆధారంగా సుప్రీంకోర్టు ప్రశాంత్‌ భూషణ్‌పై కోర్టు ధిక్కరణ కేసు విచారణను చేపట్టడమే కాకుండా ఆగస్టు 14న ఆయనను దోషిగా తేలుస్తూ తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో క్షమాపణ కోరాల్సిందిగా ఆదేశించింది. అయితే ఇందుకు ససేమిరా అంగీకరించని ప్రశాంత్‌ భూషణ్‌ ఆత్మసాక్షికి విరుద్ధంగా క్షమాపణ చెప్పబోనని స్పష్టం చేశారు. అదే సమయంలో తనని దోషిగా తేలుస్తూ ఇచ్చిన తీర్పుని రీకాల్‌ చేయాలని గత మంగళవారం కోర్టుని అభ్యర్థించారు. ఈ నేపథ్యంలో అనేక పరిణామాల అనంతరం ప్రశాంత్‌ భూషణ్‌కు శిక్ష విధిస్తూ సుప్రీంకోర్టు నేడు తీర్చునిచ్చింది. (చదవండి: క్షమాపణ కోరితే తప్పేముంది)

మరిన్ని వార్తలు