కరోనా కట్టడికి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

8 May, 2021 18:01 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్‌ కట్టడికి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. 12 మంది సభ్యులతో టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. వెస్ట్‌ బెంగాల్‌ యూనివర్శిటీ ఆఫ్‌ హెల్త్‌ సైన్సెస్‌ మాజీ వైస్‌ ఛాన్సలర్‌ భబతోష్‌ బిశ్వాస్‌, గుర్గావ్‌ మేదాంత హాస్పిటల్‌ అండ్‌ హార్ట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఛైర్‌ పర్సన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ డా.నరేష్‌ ట్రెహన్‌ ఇందులో సభ్యులుగా ఉన్నారు. టాస్క్‌ఫోర్స్‌లోని 12 మందిలో వైద్య నిపుణులు, డాక్టర్లు ప్రభుత్వం నుంచి ఇద్దరు వ్యక్తులు భాగం కానున్నారు.

క్యాబినేట్‌ సెక్రటరీ టాస్క్‌ఫోర్స్‌ కన్వీనర్‌గా ఉంటారు. ఈ బృందం వ్యాక్సిన్‌, ఆక్సిజన్‌ పంపిణీని పర్యవేక్షించనుంది. అంతేకాకుండా కరోనా చికిత్స కోసం అవసరమైన ఔషధాల అందుబాటును, మహమ్మారి కారణంగా ఎదురయ్యే సవాళ్లకు పరిష్కారాలను అందిస్తుంది. ఓ వారం రోజుల్లోగా టాస్క్‌ఫోర్స్‌ బృందం సేవలు అందుబాటులోకి రానున్నాయి.

మరిన్ని వార్తలు