సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట

16 Dec, 2020 16:04 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. కరోనా నిర్ధారణ పరీక్షల అంశంలో రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన కోర్టు ధిక్కారణ ఆదేశాలపై న్యాయస్థానం బుధవారం స్టే విధించింది. రోజుకు 50వేలు, వారానికోసారి లక్ష కరోనా పరీక్షలు చేయాలన్న ఆదేశాలను ప్రభుత్వం పాటించడం లేదని తెలంగాణ హైకోర్టు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాసరావుకు కోర్టు ధిక్కరణ నోటీసులు ఇచ్చింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం హైకోర్టు ఆదేశాలను సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేసింది. కరోనా నియంత్రణకు అవసరం అయిన మేరకు ప్రభుత్వం పరీక్షలు చేస్తోందని, రోజూ 50వేల పరీక్షల నిర్వహణ కష్టమని సుప్రీంకోర్టు దృష్టికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకు వెళ్లింది. దీంతో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సర్వోన్నత ధర్మాసనం స్టే ఇచ్చింది.

Poll
Loading...
మరిన్ని వార్తలు