గోద్రా దోషికి బెయిల్‌

16 Dec, 2022 05:38 IST|Sakshi

న్యూఢిల్లీ: 2002 నాటి గోద్రా రైలు దహనం కేసులో దోషి, యావజ్జీవ కారాగార శిక్ష పడిన ఫరూఖ్‌కు సుప్రీంకోర్టు గురువారం బెయిల్‌ మంజూరు చేసింది. అతడు గత 17 ఏళ్లుగా జైలు జీవితం అనుభవిస్తున్నాడని, అందుకే బెయిల్‌ ఇస్తున్నట్లు వెల్లడించింది. తనకు బెయిల్‌ ఇవ్వాలని కోరుతూ ఫరూఖ్‌  దాఖలు చేసిన పిటిషన్‌పై ధర్మాసనం విచారణ చేపట్టింది.

కేసులోని కొన్ని వాస్తవాలు, పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని అతడి బెయిల్‌ ఇస్తున్నట్లు కోర్టు తెలిపింది. 2002 ఫిబ్రవరి 27న గుజరాత్‌లోని గోద్రా స్టేషన్‌లో ఆగిన సబర్మతి ఎక్స్‌ప్రెస్‌పై దుండుగులు నిప్పు పెట్టారు. ఎస్‌56 కోచ్‌ పూర్తిగా దహనమయ్యింది. అందులోని 59 మంది ప్రయాణికులు మరణించారు. రాళ్లు రువ్విన ఘటనలో ఫరూఖ్‌సహా కొందరు దోషులుగా తేలారు. 

మరిన్ని వార్తలు