20 ఏళ్ల కేసులో.. సుప్రీం కీలక తీర్పు

29 Sep, 2020 18:12 IST|Sakshi

న్యూఢిల్లీ: 20 ఏళ్ల క్రితం నాటి అత్యాచార కేసులో నిందితుడిని సుప్రీంకోర్టు నిర్దోషిగా ప్రకటించింది. అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడు,  బాధితురాలు గతంలో ప్రేమలో ఉన్నారనే ఆధారాలతో కీలక తీర్పునిచ్చింది. తనను కాదని మరో మహిళను వివాహం చేసుకుంటున్నాడనే కోపంతో బాధితురాలు అత్యాచార ఆరోపణలు చేసిందని కోర్టు వెల్లడించింది. కొంత కాలం ప్రేమలో ఉన్న వ్యక్తుల మధ్య అభిప్రాభేదాలు తలెత్తడంతో ఇంతదాకా వచ్చిందని వ్యాఖ్యానించింది. అందుకనే కేసుపై పునరాలోచన చేసి తాజా తీర్పునిచ్చినట్లు పేర్కొంది. కాగా, అంతకుముందు ఇదే కేసులో ట్రయల్ కోర్టు, జార్ఖండ్ హైకోర్టు నిందితుడిని దోషిగా తీర్పు నివ్వడంతో.. అతను సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. 

కింది కోర్టుల తీర్పులను ఉంటకిస్తూ సుప్రీం కోర్టు.. 1999లో కేసు నమోదు చేసేటప్పుడు బాధిత మహిళకు 20 ఏళ్లు కాదని 25 సంవత్సరాలు అని తేల్చి చెప్పింది.  అంటే 1995లో మహిళపై దాడి జరిగిన సమయంలో ఆమె మేజర్‌ అని పేర్కొంది. ఇరువురు రాసుకున్న లేఖలతోపాటు వారు దిగిన ఫోటోలను చూడటం ద్వారా ఇద్దరు ప్రేమలో ఉన్నట్లు అర్థం అవుతోందని వ్యాఖ్యానించింది. అంతేగాని లైంగిక వేధింపులకు గురైన అనంతరం ఏ స్త్రీ కూడా నిందితుడికి ప్రేమ లేఖలు రాయదని, అతనితో నాలుగేళ్లపాటు సహజీవనం చేయదని కోర్టు పేర్కొంది. అయితే, అఘాయిత్యానికి పాల్పడిన అనంతరం నిందితుడు తనను వివాహం చేసుకుంటానని మాట ఇచ్చాడని అందుకే తను చాలా కాలం అతనితో ఉండిపోయానని బాధితురాలు పేర్కొంది.
(ముఫ్తీని ఎంతకాలం నిర్భంధంలో ఉంచుతారు?)

పెళ్లికి సిద్ధంగా ఉన్నాడు
సాక్ష్యాధారాల్ని పరిశీలించగా.. బాధితురాల్ని ప్రేమించిన నిందితుడు ఆమెను పెళ్లి చేసుకునేందుకు సిద్ధంగానే ఉన్నాడని, వారి పెళ్లికి ఇరువురు కుటుంబాలు కూడా అంగీకరించినట్లు సుప్రీం కోర్టు తెలిపింది. కానీ బాధితురాలు క్రిస్టియన్‌ కాగా నిందితుడు షెడ్యూల్డ్ తెగకు చెందినవాడని వెల్లడించింది. వేర్వేరు మతాలకు చెందినవారు కాబట్టి వివాహానికి తమ కుటుంబ సభ్యులు ఒప్పుకోరని పెళ్లికి అడ్డుపడతారని మహిళ అడ్డు చెప్పినట్టు ఆధాలున్నాయని తెలిపింది. దీంతో ఆ వ్యక్తి వారం రోజుల్లో మరో అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు తయరవుతుండగా అతనిపై అత్యాచారం, మోసం కేసు దాఖలు చేసిందని కోర్టు వివరించింది.
(యజమాని వేధింపులు: బాలిక ఆత్మహత్య )

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా