సీబీఎస్‌ఈ పరీక్షలపై విచారణ వాయిదా

11 Sep, 2020 08:45 IST|Sakshi

న్యూఢిల్లీ : సీబీఎస్‌ఈ 12వతరగతి కంపార్ట్‌మెంట్‌ పరీక్షలపై విచారణను సుప్రీంకోర్టు వచ్చేవారానికి వాయిదా వేసింది. ప్రస్తుత పరిస్థితులు కంపార్ట్‌మెంట్‌ పరీక్షల నిర్వహణకు అనుకూలంగా లేవని, పైగా ఈ పరీక్షలు పూర్తయ్యేనాటికి పైతరగతుల్లోకి అడ్మీషన్లు పూర్తయిపోతాయని, దీంతో విద్యాసంవత్సరాన్ని విద్యార్ధులు నష్టపోతారని పిటీషనర్లు కోర్టును ఆశ్రయించారు. డిగ్రీ క్లాసుల్లోకి అడ్మీషన్లు వాయిదా వేయాలని కాలేజీలను ఆదేశించాలని పిటీషనర్లు కోరారు. ఈ విషయంపై విచారణ జరిపిన కోర్టు పైతరగతుల్లో అడ్మీషన్ల ప్రక్రియకు సీబీఎస్‌ఈ ఏమీ చేయలేదని వ్యాఖ్యానించింది.  ఈ విషయంలో పిటీషనర్లు తమ అభ్యర్ధనను కేంద్రానికి పంపవచ్చని సూచించింది. తదుపరి విచారణను ఈనెల 14కు వాయిదా వేసింది. (తల్లిదండ్రులుఅనుమతిస్తేనే..!)

అంతకుముందు పిటీషనర్ల తరఫు న్యాయవాది వాదిస్తూ ప్రధాన పరీక్షలనే కోవిడ్‌ కారణంతో నిలిపివేయకుండా నిర్వహించారని, ఆ పరీక్షల మూల్యాంకనాన్ని ప్రత్యామ్నాయ పద్ధతులతో పూర్తి చేశారని, దీనివల్ల ఎంతో మంది విద్యార్ధులు కంపార్ట్‌మెంట్‌ను ఎదుర్కొంటున్నారని చెప్పారు. ఈ దఫా దాదాపు 87వేల మంది విద్యార్ధులు ఫెయిలయ్యారని, ఇందుకు సీబీఎస్‌ఈ ఏమీ చేయలేదని కోర్టు అభిప్రాయపడింది. ఈనెల 22– 29 మధ్య కంపార్ట్‌మెంట్‌ పరీక్షలు నిర్వహించేందుకు సీబీఎస్‌ఈ సన్నాహాలు చేస్తోంది. అసలు పరీక్షలనే రద్దు చేయాలన్న పిటీషన్‌ సుప్రీం ముందుకు ఈ నెల 4న రాగా, దానిపై విచారణ జరిపిన ధర్మాసనం ఆ డిమాండ్‌ను తోసి పుచ్చింది. (ఠాక్రేపై అనుచిత వ్యాఖ్యలు చేశారు)

మరిన్ని వార్తలు