పూర్తి సామర్థ్యంతో సుప్రీంకోర్టు 

8 May, 2022 18:43 IST|Sakshi

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టుకు కొత్తగా ఇద్దరు న్యాయమూర్తులు నియమితులయ్యారు. దీంతో, దేశ అత్యున్నత న్యాయస్థానం పూర్తి స్థాయిలో 34 మంది జడ్జీలతో పనిచేయనుంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ నేతృత్వంలోని కొలీజియం చేసిన సిఫారసులకు కేంద్ర న్యాయశాఖ రెండు రోజుల్లోనే ఆమోదం తెలిపింది.

ఈ మేరకు.. గువాహటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సుధాన్షు ధులియా, గుజరాత్‌ హైకోర్టుకు చెందిన జస్టిస్‌ జంషెడ్‌ బి పార్దివాలాల నియామకాలను ఆమోదిస్తూ శనివారం రెండు వేర్వేరు నోటిఫికేషన్లు విడుదల చేసింది. వచ్చే వారం వీరిద్దరూ బాధ్యతలు స్వీకరించిన తర్వాత సుప్రీంకోర్టు పూర్తి సామర్థ్యంతో 34 మంది జడ్జీలతో పనిచేయనుంది.

1965లో జన్మించిన జస్టిస్‌ పార్దివాలా 1990లో గుజరాత్‌ హైకోర్టులో లాయర్‌గా ప్రాక్టీస్‌ ప్రారంభించారు. ఉత్తరాఖండ్‌లోని ఓ కుగ్రామంలో 1960లో పుట్టిన జస్టిస్‌ ధులియా 1986లో అలహాబాద్‌ హైకోర్టులో లాయర్‌గా జీవితం ప్రారంభించారు. 

చదవండి: (భారత్‌ ప్రతిష్టను దెబ్బతీసేయత్నం.. డబ్ల్యూహెచ్‌ఓ ప్రకటనపై మంత్రుల ఆగ్రహం)

మరిన్ని వార్తలు