సి.కల్యాణ్‌కు సుప్రీంకోర్టు నోటీసులు..

1 Jul, 2021 08:07 IST|Sakshi

ఫైనల్‌ డిక్రీ పొందకుండా నిర్మాణాలు ఎలా చేపడతారని ప్రశ్నించిన ధర్మాసనం  

సాక్షి, న్యూఢిల్లీ: హఫీజ్‌పేట భూములకు సంబంధించి దాఖలైన కేసులో సినీ నిర్మాత సి.కల్యాణ్, తెలంగాణ ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసింది. సర్వే నంబర్‌ 80లో కొంతభూమి అంశంలో సి.కల్యాణ్‌కు అనుకూలంగా హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ సాహెబ్బాదీ హమీదున్నీసా బేగం సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

ఈ పిటిష న్‌ను బుధవారం జస్టిస్‌ నవీన్‌ సిన్హా, జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నాలతో కూడిన ధర్మాసనం విచారించింది. ఫైనల్‌ డిక్రీ పొందక ముందే ఆ భూముల్లో నిర్మాణాలు ఎలా చేపడతారని సి.కల్యాణ్‌ తరఫు న్యాయవాదిని ధర్మాసనం ప్రశ్నించింది. సి.కల్యాణ్‌ తరఫు న్యాయవాది శ్రీధర్‌ వాదనలు వినిపిస్తూ ఫైనల్‌ డిక్రీ వచ్చిందని చెబుతుండగా.. హైకోర్టు తీర్పులో ఫైనల్‌ డిక్రీ ఇవ్వలేదని స్పష్టంగా ఉందని ధర్మాసనం వ్యాఖ్యానిస్తూ సి.కల్యాణ్, తెలంగాణ ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది.

చదవండి: టాలీవుడ్‌ ప్రముఖ నిర్మాతపై కేసు నమోదు

మరిన్ని వార్తలు