సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్‌కు క‌రోనా

12 May, 2021 19:18 IST|Sakshi

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు న్యాయ‌మూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్‌కు క‌రోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఆయ‌న‌తోపాటు మ‌రో సిబ్బందికి కూడా కరోనా సోకినట్లు కోర్టు వ‌ర్గాలు తెలిపాయి. ఆయ‌న నేతృత్వంలోని ధ‌ర్మాస‌నం కొన్ని రోజుల పాటు స‌మావేశం కాక‌పోవ‌చ్చ‌ని కోర్టు వ‌ర్గాలు పేర్కొన్నాయి.

మ‌రోవైపు దేశంలో క‌రోనా సంక్షోభానికి సంబంధించిన అంశాల‌ను జ‌స్టిస్ చంద్ర‌చూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధ‌ర్మాస‌నం విచార‌ణ జ‌రుపుతోంది. ఈ పిటిష‌న్ల‌పై గురువారం విచార‌ణ జ‌రుగాల్సి ఉండ‌గా ఆయ‌న అందుబాటులో లేకపోవ‌డంతో మ‌రో తేదీకి వాయిదా ప‌డే సూచనలు కన్పిస్తున్నాయి. జ‌స్టిస్ బాబ్డే పదవీ విరమణ తరువాత ఆయన నేతృత్వంలోని ధర్మాసనం వింటున్నకోవిడ్‌ కేసులను జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనానికి మార్చారు. సుప్రీంకోర్టు జాతీయ విపత్తుకు " మౌనంగా ప్రేక్షకపాత్ర " వహించబోదని ఆయన ఇటీవలే కేంద్రానికి  స్పష్టం చేశారు.

( చదవండి: కరోనాతో ప్రముఖ రచయిత కన్నుమూత: ప్రధాని దిగ్భ్రాంతి )

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు