సుప్రీంకోర్టు మొబైల్‌ యాప్‌ 2.0 ప్రారంభం

8 Dec, 2022 08:38 IST|Sakshi

న్యూఢిల్లీ: ఆండ్రాయిడ్‌ వెర్షన్‌ 2.0 మొబైల్‌ అప్లికేషన్‌ను సుప్రీంకోర్టు బుధవారం ప్రారంభించింది. ఈ యాప్‌ ద్వారా కోర్టు కార్యకలాపాలను న్యాయమూర్తులు, న్యాయవాదులు, కేంద్ర శాఖల నోడల్‌ అధికారులు రియల్‌ టైమ్‌లో వీక్షించవచ్చు.

గూగుల్‌ ప్లేస్టోర్‌ నుంచి ఈ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ సూచించారు. ఐఓఎస్‌ వెర్షన్‌ మరో వారం రోజుల్లో అందుబాటులోకి వస్తుందన్నారు. యాప్‌లో లాగిన్‌ కావడం ద్వారా సుప్రీంకోర్టు ప్రొసీడింగ్స్‌ ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చని తెలిపారు. కేసులు, ఉత్తర్వులు, తీర్పులు, పెండింగ్‌ కేసుల స్థితిగతులను తెలుసుకొనేందుకు వీలవుతుందని చెప్పారు.

ఇదీ చదవండి: ఎంసీడీ.. ఆప్, బీజేపీ మధ్య అధికార పోరుకు కొత్త వేదిక

మరిన్ని వార్తలు