-

CoWIN portal: ఆధార్‌ తప్పనిసరి కాదు

1 Oct, 2021 18:21 IST|Sakshi

న్యూఢిల్లీ: కోవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకోవాలంటే కోవిన్‌ పోర్టల్‌లో ఆధార్‌ తప్పనిసరిగా ఉండాలన్న నిబంధనను తొలగించాలంటూ దాఖలు చేసిన పిటిషన్‌ పై కేంద్రానికి, ప్రత్యేక గుర్తింపు సాధికార సంస్థకు(యూఐడీఏఐ) సుప్రీంకోర్టు నోటిసులు జారీ చేసింది. ఈ మేరకు జస్టీస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం ఈ విషయం పై ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రత్వి శాఖ(ఎంఓహెచ్‌ఎఫ్‌డబ్ల్యూ), ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీకి సంబంధించిన మంత్రిత్వ శాఖ, యూఐడీఏఐలను వివరణ కోరింది. ప్రజా ప్రయోజన వ్యాజ్యం తరుఫున న్యాయవాది సిద్ధార్థ శంకర్‌ శర్మ, సామాజిక కార్యకర్త పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

(చదవండి:  వయసు 78.. బరిలో దిగిందో.. ప్రత్యర్థి మట్టి కరవాల్సిందే)


ఈ మేరకు సాంకేతికలో కొన్ని మార్పులు చేయమని ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీకి సంబంధించిన మంత్రిత్వ శాఖను ఆదేశించింది. దేశంలోని ప్రతి పౌరుడు కోవిన్‌ పోర్టల్‌లో సులభంగా యాక్సిస్‌ అయ్యేలా సాంకేతికను అప్‌డేట్‌ చేయాలని కేంద్రానికి కూడా ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో వ్యాక్సినేషన్‌కి ఆధార్‌ తప్పనసరి అని ఆంక్షలు విధించవద్దని విజ్ఞప్తి చేసింది. పైగా ఆరోగ్య  కుటుంబ సంక్షేమ మంత్రత్వి శాఖ ఆచరణాత్మక చర్యలకు విరుధంగా కచ్చితమైన ప్రామాణిక నిబంధనలను జారీ చేయడం వల్ల అందరికీ  వ్యాక్సినేషన్‌ అనే నినాదంకు అడ్డంకిగా ఏర్పడుతుందని పిటిషన్‌లో సుప్రీం కోర్టు పేర్కొంది.

(చదవండి: ‘మా నాన్న క్రేజీ.. పొద్దున మాత్రం లేజీ’...ఐదేళ్ల చిన్నారి ఫన్నీ కవిత)

మరిన్ని వార్తలు