సుప్రీంలో 4 నుంచి కొత్త రోస్టర్‌

29 Dec, 2020 06:01 IST|Sakshi

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు సోమవారం కొత్త రోస్టర్‌ను ప్రకటించింది. వచ్చే సంవత్సరం జనవరి 4 నుంచి ఈ రోస్టర్‌ అమల్లోకి వస్తుందని పేర్కొంది. ఈ కొత్త రోస్టర్‌ ప్రకారం.. ప్రజా ప్రయోజన వ్యాజ్యాల(పిల్‌)ను, లెటర్‌ పిటిషన్లను, సామాజిక న్యాయ అంశాలను ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్‌ ఎస్‌ఏ బాబ్డే,  మరో ఏడుగురు న్యాయమూర్తులు విచారణ జరుపుతారు. జస్టిస్‌ బాబ్డేతో పాటు జస్టిస్‌ ఎన్వీ రమణ, జస్టిస్‌ ఆర్‌ఎఫ్‌ నారిమన్, జస్టిస్‌ యూయూ లలిత్, జస్టిస్‌ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్‌ డీవై చంద్రచూడ్, జస్టిస్‌ అశోక్‌ భూషణ్, జస్టిస్‌ ఎల్‌ నాగేశ్వర రావు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు, సామాజిక న్యాయ వివాదాలను విచారిస్తారు. వీడియో కాన్ఫెరెన్స్‌ ద్వారా ఆరు నుంచి ఏడు ధర్మాసనాలు వివిధ కేసులను విచారిస్తాయి. పిల్‌ కేసులతో పాటు కోర్టు ధిక్కరణ, హెబియస్‌ కార్పస్, ఎన్నికలు, రాజ్యాంగ పదవులు, ప్రత్యక్ష, పరోక్ష పన్నులకు సంబంధించి కేసులను సీజేఐ విచారిస్తారు. ఆర్బిట్రేషన్, పరిహారం, మత విషయాలు, జ్యూడీషియల్‌ అధికారులకు సంబంధించిన కేసులను జస్టిస్‌ రమణ విచారిస్తారు. కంపెనీ లా, ఫ్యామిలీ లా, బ్యాంకింగ్‌ సంబంధిత కేసులను జస్టిస్‌ నారిమన్‌ నేతృత్వంలోని బెంచ్‌ విచారిస్తుంది.  

మరిన్ని వార్తలు