వచ్చే సంవత్సరం ప్రవేశం కల్పించాలి

8 Dec, 2020 08:28 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: మెడికల్‌ పీజీలో ఓ విద్యార్థినికి ప్రవేశం నిరాకరించినందుకు గాను రూ. 10 లక్షలు నష్టపరిహారం చెల్లించాలని హైదరాబాద్‌కు చెందిన కామినేని అకాడమీ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ అండ్‌ రీసెర్చ్‌ సెంటర్‌కు సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. తెలంగాణ హైకోర్టు ఆదేశాలను సవాల్‌ చేస్తూ నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన జస్టిస్‌ లావు నాగేశ్వరరావు, జస్టిస్‌ హేమంత్‌ గుప్తాతో కూడిన ధర్మాసనం సోమవారం ఈ మేరకు తీర్పు వెలువరించింది. మోతుకూరి శ్రీయ కౌముది అనే విద్యార్థిని ఈ విద్యా సంవత్సరంలో నీట్‌ పరీక్ష రాసి అర్హత సాధించారు. ప్రవేశ అర్హత సాధించిన అనంతరం ఎంఎస్‌ సర్జన్‌ కోర్సులో ప్రవేశం నిమిత్తం కళాశాలకు సకాలంలో చేరుకున్నా ఆమెకు సదరు కళాశాల ప్రవేశం నిరాకరించింది. (చదవండి: ఒక్క క్లిక్‌తో ఐఐటీ సీటు ఢమాల్‌!)

దీనిపై ఆమె హైకోర్టును ఆశ్రయించగా.. కోర్టు అనుకూలంగా తీర్పునిస్తూ తనకు ప్రత్యేక సీటు కేటాయించాలని కళాశాలను ఆదేశించింది. ఆ తీర్పును నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ సవాల్‌ చేసింది. పిటిషన్‌ను విచారించిన జస్టిస్‌ లావు నాగేశ్వరరావు ధర్మాసనం ‘‘కౌముదికి వచ్చే విద్యా సంవత్సరంలో ప్రవేశం కల్పించాలి’’అని తీర్పునిచ్చింది. 
 

మరిన్ని వార్తలు