కోవిడ్‌తో 77 మంది లాయర్ల మృతి.. సుప్రీంకోర్టు నివాళి

29 Jun, 2021 08:06 IST|Sakshi

న్యూఢిల్లీ: కోవిడ్‌తో మృత్యువాతపడిన 77 మంది లాయర్లకు సుప్రీంకోర్టు నివాళులర్పించింది. వేసవి సెలవుల తర్వాత సోమవారం సుప్రీంకోర్టు కార్యకలాపాలు ప్రారంభం కాగానే ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ సహా న్యాయమూర్తుల తరఫున సంతాపం వ్యక్తం చేశారు. ‘సుప్రీంకోర్టు బార్‌ అసోసియేషన్‌ (ఎస్‌సీబీఏ)కు చెందిన 77 మంది  కోవిడ్‌తో మృతి చెందినట్లు ఎస్‌సీబీఏ తెలిపింది.

మృతులకు మా ప్రగాఢ సంతాపం. వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ 2 నిమిషాలు మౌనం పాటిస్తున్నాం’ అని జస్టిస్‌ ఎన్వీ రమణ పేర్కొన్నారు. కరోనాతో మృతి చెందిన సభ్యులను స్మరించుకోవడం ఉత్తమమైన చర్యగా న్యాయవాది గోపాల్‌ శంకర నారాయణ అభివర్ణించారు.

చదవండి: చార్‌ధామ్‌ యాత్రకు కోర్టు బ్రేక్‌ 

మరిన్ని వార్తలు