ఆ కేసు మూసివేతపై 15న ఆదేశాలిస్తాం: సుప్రీంకోర్టు

12 Jun, 2021 09:27 IST|Sakshi

ఇటలీ నేవీ సిబ్బందిపై కేసులో సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ: కేరళ తీరంలో ఇద్దరు మత్స్యకారులను చంపిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇటాలియన్‌ నావికా దళం సిబ్బందిపై కేసు మూసివేతకు సంబంధించి ఈ నెల 15వ తేదీన ఆదేశాలు జారీ చేయనున్నట్లు సుప్రీంకోర్టు తెలి పింది. అంతర్జాతీయ మధ్యవర్తిత్వ నిబంధనలు, భారత్, ఇటలీ, కేరళ ప్రభుత్వాల మధ్య కుదిరిన ఒప్పందాలను అనుసరించి, ఆరోపణలు ఎదు  ర్కొంటున్న మెరైనర్లు మస్సిమిలానో లాటొర్రె, సల్వటోర్‌ గిరోన్‌లపై ఇటలీలో విచారణ జరుగు తుందని ఈ కేసును శుక్రవారం విచారించిన జస్టిస్‌ ఇందిరా బెనర్జీ, జస్టిస్‌ ఎంఆర్‌ షాల ధర్మాసనం పేర్కొంది.

అప్పటి ఘటనలో చనిపోయిన ఇద్దరు మత్స్యకారుల కుటుంబాలకు రూ.4 కోట్ల చొప్పున, మిగతా రూ.2 కోట్లను ఘటన చోటుచేసుకున్న పడవ ‘సెయింట్‌ ఆంథోనీ’ యజమానికి అందజే యనున్నట్లు కేరళ ప్రభుత్వం ధర్మాసనానికి నివేదిం చింది. ఈ కేసును మూసివేయాలన్న కేంద్రం విన తిపై ధర్మాసనం స్పందిస్తూ మంగళవారం ఇందుకు సంబంధించిన విధివిధానాలపై ఆదేశాలు జారీ చేస్తామని తెలిపింది.

అదేవిధంగా, పరిహారం సొమ్ములో ఎలాంటి కోత విధించకుండా పూర్తిగా బాధితులకు అందేలా చూసేందుకు కేరళ హైకోర్టు కు బదలాయించాలని తెలిపింది. ఎంవీ ఎన్రికా లెక్సీ అనే ఇటాలియన్‌ ఆయిల్‌ ట్యాంకర్‌లోని నేవీ సిబ్బంది మస్సిమిలానో లాటొర్రె, సల్వటోర్‌ గిరోన్‌ లు పడవలో చేపల వేటకు వెళ్లి వస్తున్న కేరళకు చెందిన ఇద్దరు మత్స్యకారులను కాల్చి చంపినట్లు ఆరోపణలున్నాయి. 2012 ఫిబ్రవరిలో కేరళ సమీపంలోని అంతర్జాతీయ జలాల్లో చోటు చేసు కున్న ఈ ఘటన భారత్, ఇటలీ మధ్య కొంతకాలం దౌత్య పరమైన ఉద్రిక్తతలకు కూడా దారితీయడం తెలిసిందే.

 చదవండి: పెళ్లైన రెండోరోజే పారిపోయి.. రైలులో ప్రేమించిన వాడితో పెళ్లి

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు