భూసేకరణ రద్దుకు గడువు ఉందా?

29 Sep, 2020 08:36 IST|Sakshi

న్యూఢిల్లీ: భూసేకరణ, నష్ట పరిహారం చెల్లింపు విషయంలో ఐదుగురు జడ్జీల బెంచ్‌ ఇచ్చిన తీర్పుపై స్పష్టత అవసరమని చీఫ్‌ జస్టిస్‌ ఎస్‌ఏ బాబ్డే, జస్టిస్‌ ఏఎస్‌ బోపన్న, జస్టిస్‌ రామసుబ్రమణియన్‌ల సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. ఐదుగురు సభ్యుల ధర్మాసనం తీర్పులోని కొన్ని అంశాలపై చర్చించాల్సి ఉందని వెల్లడించింది. ఈ సందర్భంగా సీజేఐ మాట్లాడుతూ.. ‘‘ దీనికి సంబంధించి నా మదిలో అనేక ప్రశ్నలు మెదలుతున్నాయి. ఈ విషయం గురించి నా సహోదరుల(న్యాయమూర్తులు)తో చర్చించాల్సి ఉంది. ఈ కేసులో రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పు గందరగోళం సృష్టించేదిగా ఉంది’’ అని వ్యాఖ్యానించారు. 

కాగా భూసేకరణ, నష్ట పరిహారం చెల్లింపు ప్రక్రియ 2014 జనవరి ఒకటిలోగా పూర్తయితే 2013 భూసేకరణ చట్టం ప్రకారం దీనిపై మళ్లీ వివాదం సృష్టించడం చెల్లదని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఈ ఏడాది మార్చి 6న తీర్పు వెలువరించింది. దీనిపై బాధితులు మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.(చదవండి: మారటోరియం... 3 రోజుల్లో ‘కేంద్రం’ నిర్ణయం..!)

>
మరిన్ని వార్తలు